News July 22, 2024
అసెంబ్లీలో కడప నేతలు వీటిపై గళం విప్పాలి

నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కడప జిల్లాకు చెందిన MLAలు జిల్లాలోని సమస్యలపై తమ గళం విప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు దృష్టి సారించాలి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. అటవీశాఖ అభ్యంతరంతో నిలిచిపోయిన పాపాగ్ని వంతెన నిర్మాణంపై దృష్టి సారించాలి. మరి మీ ఎమ్మెల్యే ఏ అంశంపై గళం విప్పాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Similar News
News November 30, 2025
వేంపల్లె: 10 రోజుల్లో డెలివరీ.. అంతలోనే విషాదం.!

ఎన్నో ఆశలు.. ఆవిరైపోయాయి. మరో 10 రోజుల్లో కుటుంబంలోకి ఇంకొకరు చేరుతారని కలలుకన్నారు. కానీ ఆ కలల కన్నీళ్లను మిగిల్చాయి. ఈ విషాదకర ఘటన వేంపల్లిలోని పుల్లయ్య తోటలో చోటు చేసుకుంది. భూదేవి(27) అనే గర్భిణీ తన ఇంటి రెండో అంతస్తులో నుంచి కింద పడి మృతిచెందింది. అదే సమయంలో గర్భంలోని శిశువు కూడా మృతి చెందింది. దీంతో ఆ కుటుంబమే కాదు.. గ్రామస్థులు, ఈ విషయం విన్న ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమవుతున్నారు.
News November 30, 2025
కడప జిల్లాలోని విద్యాసంస్థలకు రేపు సెలవు

తుఫాను నేపథ్యంలో కడప జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు, అంగన్వాడీ సెంటర్లకు సోమవారం సెలవు ప్రకటించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఈవో శంషుద్దీన్ వెల్లడించారు. విద్యార్థులు కుంటలు, కాలువలు, చెరువులు, పాడుబడ్డ గోడల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.
News November 30, 2025
కడప: తుఫాన్ ఎఫెక్ట్.. కంట్రోల్ రూములు ఏర్పాటు చేసిన విద్యుత్ శాఖ

జిల్లాలో తుపాన్ దృష్ట్యా ప్రమాదాలపై కడప జిల్లాలో 5 కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు విద్యుత్ శాఖ SE రమణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కడప జిల్లా కార్యాలయం: 9440817440
కడప డివిజన్: 9440817441
పులివెందుల డివిజన్: 9491431255
ప్రొద్దుటూరు డివిజన్: 7893261958
మైదుకూరు డివిజన్: 9492873325లను సంప్రదించాలని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


