News July 22, 2024
అసెంబ్లీలో కర్నూలు జిల్లా వాణి వినిపించాలి! (1/1)

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 5 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశముంది. ఈ క్రమంలో కర్నూలు, నంద్యాల జిల్లాలకు అవసరమైన ప్రాజెక్టులు, వివిధ పనులపై అసెంబ్లీ వేదికగా గళం విప్పేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. రోడ్లకు మరమ్మతులు, పరిశ్రమల ఏర్పాటు, తాగునీటి తదితర సమస్యలను పరిష్కరించేలా జిల్లా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం <<13679639>>దృష్టికి<<>> తీసుకెళ్లాలని ప్రజలు ఆశిస్తున్నారు.
Similar News
News October 27, 2025
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు: SP

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. ఆదివారం జిల్లాలో నేరనియంత్రణ, శాంతిభద్రత కోసం అన్ని పోలీస్ స్టేషన్లలో రౌడీ, నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించండి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు.
News October 26, 2025
వర్గీకరణ మార్కింగ్ 29లోపు పూర్తి కావాలి: జిల్లా కలెక్టర్

భూ కమతాల వర్గీకరణ మార్కింగ్ ప్రక్రియను ఈనెల 29వ తేదీలోపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సిరి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం మండల, డివిజన్ వ్యవసాయ శాఖ అధికారులతో భూకమతాల వర్గీకరణ, ఈ పంట నమోదు, పత్తి, ఉల్లి పంటల హార్వెస్టింగ్‌పై కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడువులోగా ఈ పంట నమోదు కూడా పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.