News July 23, 2024
అసెంబ్లీలో జగన్‌పై రెచ్చిపోయిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మంగళవారం అసెంబ్లీ సమావేశంలో మాజీ సీఎం జగన్‌పై రెచ్చిపోయారు. ‘జగన్ వ్యక్తిగతంగా నాపై కోడికత్తి కేసు, వివేకానంద రెడ్డి హత్య కేసు పెట్టారు. 2019 మార్చి 15న ఉదయం వివేకాకు గుండెపోటు అని చెప్పిన వ్యక్తి చివరికి నేను వైరస్‌లా దూరి చంపానన్నారు. జగన్ ఎంతోమందిని చంపించారు. అనంతబాబు ఒకరిని చంపి డిక్కీలో తీసుకొచ్చారు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Similar News
News October 5, 2024
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తనను నియమించడం పట్ల రాచమల్లు వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
News October 5, 2024
కడప జిల్లాలో 83 వీఆర్వోలు బదిలీ
కడప జిల్లాలో పలువురు వీఆర్వోలను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేడ్ 1, 2 విలేజ్ రెవెన్యూ అధికారులు 83 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముందుగా 48 మందిని బదిలీ చేశారు. అనంతరం 15, 6, 12, 2 ఇలా వరుసగా 5 ఉత్తర్వులు విడుదల చేశారు. వీళ్లందరిని కొందరిని కడప జిల్లాలోని పోస్టింగ్‌లు ఇవ్వగా మరికొందరిని అన్నమయ్య జిల్లాకు బదిలీ చేశారు.
News October 5, 2024
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి 6 నుంచి దసరా సెలవులు
రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఈనెల 6 నుంచి 13 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు, ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య అమరేంద్ర కుమార్ శనివారం తెలిపారు. తిరిగి క్లాసులు ఈనెల 14 నుంచి పునః ప్రారంభమవుతాయని చెప్పారు.