News February 24, 2025
అసెంబ్లీలో జగన్ లేకపోతే సందడే లేదు: MLA సోమిరెడ్డి

పులివెందులలో ఓడిపోతాననే భయంతోనే జగన్ అసెంబ్లీకి వస్తున్నారని MLA సోమిరెడ్డి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి 60 రోజులు రాకపోతే సభ్యత్వం రద్దవుతుందనే భయం జగన్కు ఉందని, అసెంబ్లీలో ఆయన లేకపోతే సందడే లేదన్నారు. ఓ వైపు జగన్, మరోవైపు కాకాణి పదే పదే బట్టలిప్పుతాన్నంటున్నారని హో మంత్రి వారి మీచ చర్యలు తీసుకోవాలన్నారు. జగన్ కేవలం ఫ్లోర్ లీడర్ అన్న సోమిరెడ్డి.. ఆయనకు దురాశ పనికి రాదని ఎద్దేవా చేశారు.
Similar News
News October 27, 2025
లోతట్టు ప్రాంతాల్లో కూరగాయల పంపిణీ

మొంథా తుఫాను నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా 15 మొబైల్ వాహనాల ద్వారా కూరగాయలను విక్రయించే ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. జిల్లా మార్కెటింగ్శాఖ ఆధ్వర్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలకు ఈ మొబైల్ వాహనాలను పంపి ప్రజలకు నాణ్యమైన కూరగాయలను తక్కువ ధరకు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెప్పారు.
News October 27, 2025
కందుకూరును ప్రకాశం జిల్లాలో కలపాలి: JAC

కందుకూరు జేఏసీ నేతలు సోమవారం కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం అందజేశారు. కందుకూరు ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని వారు కోరారు. ఇందుకు నెల్లూరు నేతల అడ్డగింత సరికాదని విమర్శించారు. ప్రజల సెంటిమెంట్కు అనుగుణంగా ప్రభుత్వం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.
News October 27, 2025
భారీ వర్షాలు.. జిల్లాలో కంట్రోల్ రూం నంబర్లు ఇవే.!

☞ నెల్లూరు కలెక్టరేట్: 0861 2331261, 7995576699
☞ కందుకూరు సబ్ కలెక్టరేట్: 7601002776
☞ నెల్లూరు RDO ఆఫీసు: 9849904061
☞ ఆత్మకూరు RDO ఆఫీసు: 9100948215
☞ కావలి RDO ఆఫీసు: 7702267559
☞ ఆయా పరిధిలోని ప్రజలు ఇబ్బందులు ఉంటే ఈ నంబర్లకు సమాచారం అందించాలని కలెక్టర్ తెలిపారు.


