News November 16, 2024
అసెంబ్లీలో RRRతో విశాఖ ఎమ్మెల్యే వాగ్వాదం

ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ RRR, విశాఖ MLAకి మధ్య వాగ్వాదం జరిగింది. కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుపై విష్ణుకుమార్ రాజు మాట్లాడుతుండగా టైం అయిపోందని RRR బెల్ కొట్టారు. ‘మీరు అప్పుడే బెల్ కొడితే ఎలా అధ్యక్షా. గంట పర్మిషన్ తీసుకున్నా’ అని MLA చెప్పగా.. ‘అందరికీ కలిపి ఒక గంట సమయం ఇచ్చారు. మీకు ఒక్కరికే కాదు. ఇంకా 25 మంది మాట్లాడాలి. త్వరగా ముగించండి’ అంటూ మరికాస్త సమయం ఇచ్చారు.
Similar News
News March 10, 2026
జీవీఎంసీ ప్రస్థానం: తొలి మేయర్ నుండి నేటి పాలన వరకు!

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీకి చెందిన పులుసు జనార్దనరావు తొలి మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం ముగిశాక, దాదాపు పదేళ్ల పాటు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికలు జరగకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనలోనే జీవీఎంసీ కొనసాగింది. సుదీర్ఘ విరామం తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించడంతో నగరపాలక సంస్థకు ప్రజాప్రతినిధుల పాలన తిరిగి ప్రారంభమైంది
News March 10, 2026
విశాఖ రుషికొండలో ‘క్రౌన్ ప్లాజా’ హోటల్

విశాఖపట్నం రుషికొండలో ‘కోస్టల్ హాస్పిటాలిటీ ప్రిసింక్ట్’ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిని ‘క్రౌన్ ప్లాజా’ బ్రాండ్‌తో కె.పి.సి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మించనుంది. సుమారు ₹280.51 కోట్ల పెట్టుబడితో చేపట్టే ఈ ప్రాజెక్ట్ ద్వారా 310 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. పర్యాటక పాలసీ 2024-29లో భాగంగా ప్రభుత్వం భూమిని, ప్రోత్సాహకాలను కేటాయించింది.
News March 10, 2026
పోర్టు రైల్వే ఎంట్రన్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి

పోర్టులోకి వచ్చే రైల్వే ట్రాక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు హార్బర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. గూడ్స్ రైలు పోర్ట్‌లోకి వస్తుండగా ఒక్కసారిగా శబ్దంతో కరెంటు పోవడం ఎలక్ట్రికల్ రైలు ఆగిపోవడం గుర్తించిన అప్పారావు అనే వ్యక్తి ఏం జరిగిందని పరిశీలించగా పోల్ పక్కన పడిపోయిన వ్యక్తిని గమనించాడు. వ్యక్తి వివరాలు తెలియకపోవడంతో హార్బర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


