News February 24, 2025

అసెంబ్లీలో YCPని ప్రతిపక్షంగా గుర్తించాలి: పెద్దిరెడ్డి 

image

అసెంబ్లీలో వైసీపీని ప్రభుత్వం ప్రతిపక్షంగా గుర్తించాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విధ్వంసం సృష్టించినట్లు ఆరోపణలు చేస్తున్న కూటమి ప్రభుత్వం వాటిని ఎక్కడా నిరూపించలేదన్నారు. అసెంబ్లీలో మాజీ సీఎం జగన్‌కు మాట్లాడే అవకాశం కల్పించాలని,  ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. 

Similar News

News February 24, 2025

చిత్తూరు యువతి హీరోయిన్‌గా అరంగేట్రం

image

చిత్తూరు జిల్లాకు చెందిన సౌందర్య రవికుమార్ తమిళ చిత్రంలో తళుక్కుమన్నారు. నటన పట్ల ఆసక్తిగల సౌందర్య తన ప్రతిభతో గొప్ప అవకాశాన్ని దక్కించుకున్నారు. తమిళంలో దర్శకుడు గౌతమ్ మీనన్ అసిస్టెంట్ బాలు పులిచెర్ల దర్శకత్వంలో రూపొందుతున్న విక్రమ్ కే దాస్ చిత్రంలో సౌందర్య హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ కుమార్తె సౌందర్య చిన్ననాటి నుంచి కళల రంగంలో రాణిస్తోంది.

News February 24, 2025

తిరుపతి: పదేళ్ల బాలికపై అత్యాచారయత్నం

image

తిరుపతిలో ఆదివారం దారుణం వెలుగులోకి వచ్చింది. ఐదో తరగతి బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేసినట్లు అలిపిరి సీఐ రామకృష్ణ తెలిపారు. పదేళ్ల బాలిక ఇంటి వద్ద ఆడుకుంటుండగా రమణాచార్య అనే వ్యక్తి బాలికను మద్యం మత్తులో ఇంట్లోకి తీసుకెళ్లి బలవంతం చేయబోయాడు. తన మాట వింటే డబ్బులు ఇస్తానంటూ ఆశ చూపాడు. దీంతో బాలిక భయంతో ఇంటికి చేరుకుని విషయాన్ని తల్లికి చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 24, 2025

చిత్తూరులో ఏడు మంది అరెస్టు

image

చిత్తూరు నగరంలోని సంతపేట పాంచాలపురంలో జూదం ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసి రూ.7,100 నగదు స్వాధీనం చేసుకున్నట్లు టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య తెలిపారు. తేనె బండ శివారులో జూదమాడుతున్న మరో ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. 7 మందిని కోర్టుకు హాజరు పరచమన్నారు. జూదం లాంటి చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

error: Content is protected !!