News February 24, 2025
అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో సిక్కోలు ఎమ్మెల్యేలు

శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లాలోని నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, గొండు శంకర్, గౌతు శిరీష, బగ్గు రమణమూర్తి, నడుకుదిటి ఈశ్వరరావు, మామిడి గోవిందరావు, బెందాళం అశోక్, కూన రవికుమార్ హాజరయ్యారు. నియోజకవర్గంలోని సమస్యలపై రేపటి నుంచి సభలో గళం వినిపించడానికి సిద్ధమయ్యారు.
Similar News
News November 24, 2025
ఎచ్చెర్ల : మూడు కోర్సుల్లో జీరో అడ్మిషన్లు

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మూడు కోర్సులను ప్రారంభించారు. జియోఫిజిక్స్, జియాలజీ, ఫిలాసఫీ ఈ కోర్సుల్లో ఒక్క విద్యార్థి సైతం చేరలేదు. జాతీయ స్థాయిలో ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో వీటిని మూసివేసిన ఇక్కడ ప్రారంభించడంపై నిపుణులు తప్పుపట్టారు. అధికారుల అవగాహన లేక ప్రారంభించారని విద్యావేత్తలు అంటున్నారు.
News November 24, 2025
ఎచ్చెర్ల: పాలకమండలి సమావేశం ఎప్పుడో..?

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీలో 2022 NOVలో పాలకమండలి చివరి సమావేశం జరిగింది. మూడేళ్లైనా..ఇప్పటికీ సమావేశం ఊసేలేదు. కనీసం ఆరు నెలలకోసారైన సమీక్ష జరగాలని విద్యావేత్తలు అంటున్నారు. పాలన, అకాడమిక్, అభివృద్ధి అంశాలపై చర్చలు జరుగుతాయి. ఈ మండలిలో ఉన్నతాధికారులు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులతో 12 మంది ఉన్నారు. నిబంధనలు మేరకు మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలు తీర్చాలని విద్యార్థులు కోరుతున్నారు.
News November 24, 2025
నేడు ప్రజా ఫిర్యాదు నమోదు కార్యక్రమం: కలెక్టర్

ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నేడు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.


