News November 12, 2024

అసెంబ్లీ విప్‌గా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్

image

రాష్ట్ర అసెంబ్లీ విప్‌గా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను ప్రభుత్వం నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యేగా వరుసగా మూడోసారి గెలిచిన అశోక్‌ను విప్‌గా నియమించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల కేటాయింపులో భాగంగా అశోక్‌కు ఈ పదవి వరించింది.

Similar News

News November 19, 2025

ఎన్ కౌంటర్‌లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

image

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.

News November 19, 2025

బాలికను రెండేళ్లుగా చీకటి గదిలో నిర్బబంధించిన తల్లి

image

చీకటి గదిలో రెండేళ్లుగా మగ్గుతున్న ఓ బాలికకు న్యాయాధికారి చొరవతో విముక్తి లభించింది. ఈ ఘటన ఇచ్ఛాపురంలోని చక్రపాణి వీధిలో నిన్న వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి మరణంతో మానసికంగా కుంగిపోయిన తల్లి ఆడపిల్లను బయటకు పంపితే ఏం జరుగుతుందోని భయంతో ఇలా బంధించింది. స్థానికుల సమాచారంతో న్యాయాధికారి, రెవెన్యూ, ఐసీడీఎస్ అధికారులు వీరిద్దర్నీ బయటకి తీసుకొచ్చారు. పరిస్థితి బాగాలేకపోవడంతో ఆసుపత్రికి తరలించారు.

News November 19, 2025

SKLM: ‘విద్యార్థులకు, రైతులకు రుణాలందించే చర్యలు చేపట్టాలి’

image

విద్యార్థులకు, రైతులకు రుణాలు ఇచ్చే చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని కలెక్టర్ సమావేశం మందిరంలో జిల్లా స్థాయి లీడ్ బ్యాంక్ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు వివిధ సంక్షేమ పథకాలు అమలులో బ్యాంకుల ప్రాముఖ్యతను వివరించారు.ప్రధానంగా ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలన్నారు.మత్స్యశాఖ మెరైన్ పోలీస్ తదితర శాఖలపై చర్చించారు.