News November 13, 2024
అసెంబ్లీ విప్‌గా రాయదుర్గం ఎమ్మెల్యే శ్రీనివాసులు

అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులకు కీలక పదవి లభించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విప్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన గత టీడీపీ ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యులుగా కూడా సేవలందించారు. విప్‌గా ఎంపికైనందుకు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.
Similar News
News March 9, 2026
అసాంఘిక పనులకు పాల్పడితే కఠిన చర్యలు: SP

జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడటంలో సక్రమ ప్రవర్తన ఎంత ముఖ్యమో పోలీసు అధికారులు వారికి అవగాహన కల్పించారు. పాత నేరాలను వదిలిపెట్టి, బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని సూచించారు. ఎవరైనా తిరిగి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా లేదా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
News March 8, 2026
1100 సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ‘మీ కోసం’ కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. అర్జీలు పరిష్కారం కాలేదా లేదా స్థితి తెలుసుకోవాలంటే 1100కు కాల్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చన్నారు. ఈ నెల 9న అనంతపురం కలెక్టరేట్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తామన్నారు.
News March 8, 2026
ఏప్రిల్ నెలాఖరులోగా పనులను పూర్తిచేయాలి: కలెక్టర్

జిల్లాలోని 20 సబ్‌స్టేషన్లలో జరుగుతున్న పనులను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శింగనమల మండలం పెరవలిలో PM-KUSUM పథకం కింద ఏర్పాటు చేస్తున్న 4 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. రైతులు, మెఘా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో సమావేశమై మాట్లాడారు.


