News February 26, 2026

అసెంబ్లీ స్పోర్ట్స్ మీట్‌లో ఎమ్మెల్యేల జోరు

image

విజయవాడలో జరుగుతున్న అసెంబ్లీ స్పోర్ట్స్ మీట్‌లో MLA బండారు శ్రావణి బ్యాడ్మింటన్ పోటీల్లో సత్తా చాటారు. మహిళల సింగిల్స్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నారు. మరోవైపు త్రోబాల్ పోటీలో మంత్రి సంధ్యారాణి జట్టుపై MLA పరిటాల సునీత టీమ్ విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 21-14 తేడాతో సునీత జట్టు గెలుపొందింది. జిల్లా ప్రజాప్రతినిధులు క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

Similar News

News April 12, 2026

ఇంటర్ సెకండియర్ ఫలితాలు.. ఆసిఫాబాద్‌కు 3వ ర్యాంకు

image

ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆసిఫాబాద్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 3,745 మంది పరీక్షలు రాయగా 3,077 మంది పాసై 82.16% ఉత్తీర్ణతతో 3వ స్థానంలో నిలిచింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 654 మందికి 576 మంది పాసై 88.07 శాతంతో మొదటి స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 270 మందికి 114 మంది పాసై 42.22%తో 3వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 34 మందికి 22 మంది పాసై 64.71 %తో 14వప్లేస్ వచ్చింది.

News April 12, 2026

ఇంటర్ సెకండియర్ RESULTS.. భూపాలపల్లికి 2వ ర్యాంక్

image

ఇంటర్ 2nd ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. భూపాలపల్లి(D)లో రెగ్యులర్ విద్యార్థులు 1454 మంది పరీక్షలు రాయగా 1184 మంది పాసై 82.34 శాతంతో స్టేట్‌లోనే రెండో స్థానం వచ్చింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 302 మందికి 255 మంది పాసై 84.44 శాతంతో 4వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 44 మందికి 26 మంది పాసై 59.09%తో 1వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో ఐదుగురికి ఒక్కరు పాసై 20.0%తో చివరి(35) స్థానం వచ్చింది.

News April 12, 2026

ఫలితాలు విడుదల.. నిరాశ వద్దు మిత్రమా!

image

TG: ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్స్ ఎలా వచ్చినా నిరాశపడొద్దు. మీ టాలెంట్‌ను, ఫ్యూచర్‌ను పరీక్షలే నిర్ణయిస్తాయి అనుకోవడం పెద్ద తప్పు. ఆశించిన ఫలితం రానంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్లు కాదు. సప్లిమెంటరీ రాసి పడిలేచిన కెరటంలా ముందుకెళ్లాలి. అటు పిల్లలు ఫెయిలైనా, తక్కువ మార్కులు వచ్చినా తల్లిదండ్రులు అవమానించవద్దు. మీరే అలా చేస్తే వారికి ధైర్యం చెప్పేవారు ఎవరు?
Share It