News May 25, 2024

అస్వస్థతకు గురై తుని రైల్వే స్టేషన్‌లో వ్యక్తి మృతి

image

కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్‌లోని ఒకటో నెంబర్ ప్లాట్‌ఫాంపై ఓ వ్యక్తి అస్వస్థతకు గురై మృతి చెందినట్లు జీఆర్పీ SI అబ్దుల్ మారుఫ్ తెలిపారు. విశాఖలోని కృష్ణ మార్కెట్ ప్రాంతంలో బంగారం పనిచేసే మధుపాక భాస్కర్‌రావు(45)గా గుర్తించారు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విశాఖ నుంచి బ్రహ్మంగారి మఠానికి ట్రైన్‌లో వెళ్తుండగా.. తుని రైల్వే స్టేషన్‌లో దిగి ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు ఎస్సై తెలిపారు.

Similar News

News November 21, 2025

రాజమండ్రి: ఆర్టీసీకి రూ.32 లక్షల ఆదాయం

image

కార్తీక మాసం నేపథ్యంలో ఆర్టీసీకి కాసుల పంట పండింది. కార్తీకం వేళ జిల్లాలో ఉన్న డిపోల నుంచి 36 బస్సులు నడపడం ద్వారా రూ.32 లక్షల ఆదాయం వచ్చిందని డీపీటీవో మూర్తి శుక్రవారం తెలిపారు. శబరిమలకు 8 బస్సులు, పంచారామాలకు 13 బస్సులు, ఏకాదశి రుద్రులు, నవ నందులు, శివ కేశవ దర్శిని, కోనసీమ స్పెషల్‌గా 15 బస్సులు నడిపామన్నారు. అయ్యప్ప భక్తుల కోసం, అలాగే ధనుర్మాసంలో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందన్నారు.

News November 21, 2025

తూ.గో: ‘రాజమౌళికి కాంగ్రెస్ అండగా ఉంటుంది’

image

సినీ దర్శకుడు రాజమౌళిపై కేసులు నమోదు చేయడం బీజేపీ అసహనానికి, సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మండిపడ్డారు. హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపి కేసులు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజమౌళికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు రాజమండ్రిలో తెలిపారు. తక్షణమే ఈ అర్థరహితమైన ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.

News November 20, 2025

మల్లవరం పంచాయతీకి రాష్ట్రంలో ద్వితీయ స్థానం

image

శానిటేషన్ IVRS కాలింగ్‌లో చాగల్లు మండలం మల్లవరం పంచాయతీ రాష్ట్రంలోనే ద్వితీయ స్థానం దక్కించుకుంది. ఈ విషయాన్ని ఎంపీడీవో శ్రీదేవి గురువారం ప్రకటించారు. పబ్లిక్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో, ఇంటింటికీ చెత్త సేకరణకు 100 శాతం, కనీసం వారానికి రెండుసార్లు సేకరణకు 92 శాతం మార్కులు సాధించింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి కమలావతిని ఎంపీడీవో సన్మానించారు.