News February 27, 2025
అహోబిలంలో మార్చి 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

అహోబిలంలో మార్చి 2న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ప్రధానార్చకులు కీడాంబి వేణుగోపాలన్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కోయిల్ అంటే గుడి అని ఆళ్వార్ అంటే భక్తుడని తెలిపారు. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే గుడిని శుద్ధి చేసే ప్రక్రియ అన్నారు. ఎగువ, దిగువ అహోబిలం క్షేత్రాలలో ఆ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తులకు శ్రీ స్వామి దర్శనం ఉండదని తెలిపారు.
Similar News
News March 20, 2025
నిబంధనలు పాటించకపోతే కొరడా తప్పదు: డీఈవో

జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు వంటి పూట బడులను నిర్ధిష్ట వేళలు పాటించకుండా ఇస్తాను సారంగా నడిపితే చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ గురువారం అన్నారు. ఈ విషయంపై తమ దృష్టికి వస్తే పాఠశాలల మూసివేతకు ఆదేశాలు ఇస్తామని హెచ్చరించారు. ఒంటిపూట బడులకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన సమయ పాలనను ప్రైవేట్ యాజమాన్యాలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
News March 20, 2025
‘ఆర్యవైశ్యులు సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’

ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలను ఆర్యవైశ్యులు సద్వినియోగం చేసుకోవలని ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ నంద్యాల నాగేంద్ర అన్నారు. గురువారం ఆయన నగరంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి గాను సబ్సిడీతో కూడిన రుణాలను వివిధ వ్యాపారాల ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందేందుకు 22వ తేదీ లోపు దరఖాస్తులను ఆన్‌లైన్ చేసుకోవాలని కోరారు.
News March 20, 2025
డిప్యూటీ సీఎం పర్యటనను విజయవంతం చేయండి: కలెక్టర్

ఈ నెల 22న డిప్యూటీ సీఎం జిల్లాకు రానున్నారని, అందుకు సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా చేసి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామ పరిధిలో ఉన్న రైతు పొలంలో ఫారంపాండ్‌కు భూమిపూజ చేయనున్నారు. తదుపరి బహిరంగ సభలో పాల్గొననున్న సందర్భంగా ఎస్పీతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.