News March 6, 2025

ఆందోలు: ఉద్యోగులు సమయపాలన పాటించాలి: మంత్రి

image

వైద్య శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి సమయపాలన పాటించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్ మొదలుకొని డాక్టర్ వరకు ప్రతి ఒక్కరు సమయానికి విధులు నిర్వహించాలని చెప్పారు. సమయపాలన పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రులను తాను తనిఖీ చేస్తానని పేర్కొన్నారు.

Similar News

News January 6, 2026

గడువులోగా అభ్యంతరాలను సమర్పించాలి: నిర్మల్ కలెక్టర్

image

మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి రూపొందించిన ముసాయిదా ఓటరు జాబితాపై ఉన్న అభ్యంతరాలను నిర్ణీత గడువులోగా సమర్పించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. మంగళవారం నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో వేరు వేరుగా ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా తయారీ, అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితా ప్రచురణ ప్రక్రియపై వివరించారు.

News January 6, 2026

కార్లు కొనడం తగ్గిస్తే కాలుష్యం తగ్గుతుంది: CJI

image

కాలుష్య నివారణలో ధనవంతులూ త్యాగాలు చేయాలని CJI సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ‘కార్లు స్టేటస్ సింబల్‌గా మారాయి. సైకిళ్లు మానేసి కార్లు కొనడానికి డబ్బు ఆదా చేస్తున్నారు. ధనవంతులు ఎక్కువ కార్లు కొనడం మానేస్తే కాలుష్యం తగ్గుతుంది. హై ఎండ్ కార్లకు బదులు EVలను వాడొచ్చు’ అని సూచించారు. ఢిల్లీ కాలుష్య నివారణలో AQMC విఫలమవుతోందన్నారు. టోల్ ప్లాజాల మూసివేతకు 2నెలల సమయం కావాలని కోరడాన్ని తప్పుబట్టారు.

News January 6, 2026

ఓటర్ల జాబితా రూపకల్పనలో పారదర్శకత పాటించాలి: కలెక్టర్

image

రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో మున్సిపల్ ఎన్నికలు, ఓటర్ల జాబితా సవరణ, అభ్యంతరాల పరిష్కారంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఓటర్ల జాబితా కీలక పాత్ర పోషిస్తుందన్నారు.