News March 6, 2025
ఆందోలు: ఉద్యోగులు సమయపాలన పాటించాలి: మంత్రి

వైద్య శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి సమయపాలన పాటించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్ మొదలుకొని డాక్టర్ వరకు ప్రతి ఒక్కరు సమయానికి విధులు నిర్వహించాలని చెప్పారు. సమయపాలన పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రులను తాను తనిఖీ చేస్తానని పేర్కొన్నారు.
Similar News
News March 22, 2025
కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. ఇద్దరికి గాయాలు

రామారెడ్డి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల కేంద్రానికి చెందిన మీసేవ నిర్వాహకుడు దినేశ్ మృతి చెందాడు. ఎస్ఐ నరెశ్ తెలిపిన వివరాల ప్రకారం.. బైక్‌పై వెళ్తున్న దినేశ్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ప్రమాదంలో ఆటోలోని ఇద్దరు ప్రయాణికులతో పాటు డ్రైవర్ లింబాద్రికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
News March 22, 2025
ఎర్త్ అవర్‌లో స్వచ్ఛందంగా పాల్గొనండి: CBN

AP: నేడు ఎర్త్ అవర్ సందర్భంగా గంట పాటు లైట్లను ఆపేసే కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని CM CBN పిలుపునిచ్చారు. మనందరికీ ఆవాసమైన భూమిని కాపాడుకునేందుకు కృషి చేయాలన్నారు. ఈ ఏడాది ప్రపంచ జల దినోత్సవం రోజునే ఎర్త్ అవర్ వచ్చిందన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్‌కు నీటి భద్రత, ఇంధన ఖర్చు తగ్గించడమే కీలకమని చెప్పారు. మనం చేసే చిన్న పనులే పెద్ద మార్పునకు దారి తీస్తాయనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.
News March 22, 2025
నంద్యాల జిల్లాలో దారుణ హత్య

బండిఆత్మకూరు మండలం లింగాపురంలో శనివారం దారుణ హత్య చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నంద్యాల సుధాకర్ రెడ్డి పొలం వద్దకు వెళ్తుండగా కొత్తచెరువు దగ్గర మాటువేసిన గుర్తుతెలియని దుండగులు ఆయనను అత్యంత కిరాతకంగా నరికి చంపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.