News May 21, 2024

ఆందోల్: జీలుగు విత్తనాల కోసం క్యూలో పాస్ పుస్తకాలు, చెప్పులు

image

ఆందోల్ మండలం జోగిపేట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆఫీస్ ముందు రైతులు జీలుగ విత్తనాల కోసం పట్టా పాసు బుక్కులు, చెప్పులను క్యూ లైన్‌లో పెట్టారు. పండించిన పంటను అమ్ముకోవడానికి ఒకవైపు వర్షంలో తడుస్తూ నానా తంటాలు పడుతుంటే.. మరో వైపు భూమి సారవంతం కావడానికి జీలుగు విత్తనాల కోసం అనేక పాట్లు పడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News December 19, 2025

MDK: సతులు సర్పంచ్‌లు.. పతులు వార్డ్ మెంబర్‌లు

image

నర్సాపూర్ మం. ఆవంచ, కాగజ్ మద్దూర్‌లో సర్పంచులుగా సతీమణులను గెలిపించుకొని, భర్తలు వార్డు సభ్యులుగా గెలుపొందారు. ఆవంచలో స్రవంతి సర్పంచ్‌గా గెలుపొంది, భర్త కర్ణాకర్ (Ex.సర్పంచ్) వార్డ్ సభ్యుడిగా గెలుపొందారు. కాగజ్ మద్దూర్లో విజయ సర్పంచ్‌గా గెలుపొంది, భర్త శివకుమార్ (Ex.సర్పంచ్) వార్డు సభ్యుడిగా గెలుపొందారు. వారు మాజీ సర్పంచ్‌లుగా కొనసాగి గ్రామానికి సేవలు అందించిన మళ్లీ గ్రామస్థులు పట్టం కట్టారు.

News December 18, 2025

మెదక్ జిల్లాలో మొత్తం పోలింగ్ 89.30 %

image

మెదక్ జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 89.30 % పోలింగ్ నమోదైంది. 21 మండలాలు, 492 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా.. మొత్తం 4,98,152 మంది ఓటర్లకు 4,44,842 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 2,39,339లో 2,15,602 మంది, మహిళలు 2,58,806లో 2,29,235 మంది, ఇతరులు ఏడుగురిలో 5 మంది ఓటు వేశారు.

News December 18, 2025

చేగుంట: ట్రాక్టర్ కిందపడి యువకుడి మృతి

image

పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేగుంట మండలం కరీంనగర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అక్బర్ గత నెల 29న ఈ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో గురువారం మరణించాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.