News March 13, 2025

ఆంధ్రప్రదేశ్-తెలంగాణను కలిపే వంతెనపై ప్రజల్లో ఆశాభావం

image

అమ్రాబాద్-పదర మండలాలను కలిపే కృష్ణా నదిపై వంతెన నిర్మాణం నల్లమల ప్రజలకు దశాబ్దాల కల. మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి దేవస్థానం సమీపంలో ఈ వంతెన నిర్మాణం జరిగితే, వాణిజ్య, వ్యవసాయ, పర్యాటక రంగాలు అభివృద్ధి చెందుతాయని ప్రజలు భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రస్తావన వచ్చినా అమలు కాలేదు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి స్వస్థలం NGKL జిల్లా కావడంతో, 30ఏళ్ల కల నెరవేరుతుందన్న ఆశ ప్రజల్లో వ్యక్తమౌతోంది.

Similar News

News February 12, 2026

గ్లోబల్ మార్కెట్లో నరవణె బుక్.. ప్లాన్ ప్రకారమే లీక్!

image

ఆర్మీ మాజీ చీఫ్ నరవణె <<19103224>>పుస్తకం లీక్‌<<>>పై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రక్షణ శాఖ అనుమతి లేకున్నా గ్లోబల్ మార్కెట్లో అమ్మకాలు జరిపినట్లు తెలుస్తోంది. ఇది పక్కా ప్లాన్ ప్రకారం, సమన్వయంతో చేసిన లీక్ అని పోలీసు వర్గాలు తెలిపాయి. పుస్తకం US, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియాలో అందుబాటులోకి వచ్చినట్లు చెప్పాయి. దీంతో ఆ దేశాల్లో డిజిటల్, ఫైనాన్షియల్ మార్గాలను ట్రాక్ చేస్తున్నట్లు వెల్లడించాయి.

News February 12, 2026

NLG: మహా శివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

image

మహా శివరాత్రి పండుగ సందర్భంగా శైవ క్షేత్రాల దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ఈ నెల 14, 15 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడుపుతోందని ఆర్ఎం కె.జానిరెడ్డి తెలిపారు. DVK డిపో నుంచి శ్రీశైలం, KDD డిపో నుంచి ముక్త్యాల, మేళ్లచెర్వు, HZNR నుంచి మేళ్లచెర్వుకు, MLG డిపో నుంచి వాడపల్లి, సోమప్ప, సత్రశాలకు బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. SRPT డిపో నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతామని తెలిపారు.

News February 12, 2026

చిత్తూరు: పరీక్షల్లో అధికారుల ఫెయిల్.. 19మందిపై చర్యలు

image

రెవెన్యూ శాఖలో తాత్కాలిక షరతులతో సీనియర్ అసిస్టెంట్లుగా ఇటీవల ప్రమోషన్ వచ్చింది. శాఖాపరమైన పరీక్షల్లో పాస్ కాకపోవడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 19 మందిని తిరిగి గ్రేడ్-1 వీఆర్వోలుగా రివర్షన్ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. వీరు శాఖపరమైన పరీక్షల్లో అనుకున్న మేర ఫలితాలు సాధించకపోవడంతో రివర్షన్ ఇచ్చినట్టు అందులో పేర్కొన్నారు.