News April 3, 2024

ఆంధ్రప్రదేశ్ తొలి స్పీకర్లు ఇద్దరూ నరసరావుపేట వారే

image

రాజకీయ చైతన్యానికి మారుపేరైన నరసరావుపేట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇద్దరు తొలి స్పీకర్లను అందించింది. మద్రాసు నుంచి ఏపీ విడిపోయిన తర్వాత 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్ర తొలి స్పీకర్‌గా నరసరావుపేటకు చెందిన నల్లపాటి వెంకట్రామయ్య చౌదరి ఎన్నికయ్యారు. అదేవిధంగా 2014లో తెలంగాణ, ఆంధ్రా విడిపోయిన నేపథ్యంలో నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా కోడెల శివప్రసాదరావు ఎన్నికయ్యారు.

Similar News

News March 3, 2026

RRR కస్టడీ హింసల కేసులో ట్విస్ట్

image

AP Dy స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టడీ హింసల కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న IPS అధికారి సునీల్ నాయక్‌కు AP హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు దర్యాప్తు అధికారికి ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. విచారణకు సహకరించాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది. కేసులో తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

News March 2, 2026

దుగ్గిరాలలో రోడ్డు ప్రమాదం.. చెట్టు ఎక్కిన బైక్!

image

బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకులు గాయపడగా, వారి వాహనం వింతగా చెట్టుపైకి దూసుకెళ్లిన ఘటన దుగ్గిరాల లాకు వద్ద జరిగింది. చినరావూరుకు చెందిన కిషోర్, విజయ్ ప్రయాణిస్తున్న బైక్ ప్రమాదవశాత్తూ పడిపోగా, బైక్ మాత్రం చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోయింది. గాయపడిన యువకులను చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News March 2, 2026

తుళ్లూరులో కొడుకుని పట్టించిన పేరెంట్స్..!

image

తుళ్లూరు మండల పరిధిలోని గ్రామాల్లో ఆవులను దొంగతనం చేస్తున్న వ్యక్తిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు శ్రీకాంత్ మండల వ్యాప్తంగా సుమారు 25 ఆవులకు పైగా అపహరించినట్లు పలువురు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతణ్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా, స్టేషన్ వెనకవైపు ఉన్న గోడ దూకి పారిపోయాడు. తిరిగి కుటుంబ సభ్యులు పోలీసులకు అప్పజెప్పగా సిబ్బంది పేరెంట్స్‌ను అభినందించారు.