News September 19, 2024
ఆంధ్రా-ఒడిశా అంతర్రాష్ట్ర రహదారిని విస్తరించండి: ఎంపీ
ఆంధ్ర- ఒడిశా అంతర్రాష్ట్ర రహదారిని నాలుగు లేన్ల రహదారిగా విస్తరించాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు, కేంద్ర రోడ్డు రవాణా& హైవేస్ మంత్రికి గురువారం వినతిపత్రాలు అందజేశారు. రామభద్రపురం-రాయగడ రహదారిని విస్తరించాలని, అలాగే, ప్రస్తుతం చాలా అధ్వానంగా ఉన్న కూనేరు-రాయగడ రహదారి మరమ్మతు పనులు చేపట్టాలని ఎంపీ కోరారు.
Similar News
News October 10, 2024
చంద్రబాబును పైడితల్లి ఉత్సవాలకు ఆహ్వానించిన ఎంపీ కలిశెట్టి
అక్టోబర్ 13, 14, 15 తేదీల్లో విజయనగరంలో జరగనున్న ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి తొల్లేళ్లు, సినిమానోత్సవం నిర్వహించనున్నారు. కాగా ఉత్సవాలకు రావాలని సీఎం చంద్రబాబుకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆహ్వానించారు. వారితో పాటు ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఉన్నారు.
News October 10, 2024
దుర్గాదేవి అవతారంలో పైడితల్లి అమ్మవారు
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విజయనగరం వాసుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. రైల్వే స్టేషన్ వద్ద గల అమ్మవారి వనం గుడిలో దుర్గాష్టమి అర్చకులు దుర్గాదేవి అవతారంలో అమ్మవారిని అలంకరించి విశేష పూజలు, అర్చనలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
News October 10, 2024
గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు బోగీలు
దసరా పండగ రోజుల్లో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు రైళ్లకు అదనపు బోగీలు జత చేయనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కే.సందీప్ తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 10 నుంచి 16 వరకు గుంటూరు-రాయగడ(17243), ఈనెల 11 నుంచి 17 వరకు రాయగడ-గుంటూరు (17244) రైళ్లకు రెండు సాధారణ, రెండు స్లీపర్ బోగీలు జత చేయనున్నామన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరారు. >Share It