News July 18, 2024
ఆంధ్ర కేసరి వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా ఆచార్య DVR మూర్తి

ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం(ఒంగోలు) ఇన్ఛార్జ్ ఉపకులపతిగా ఏయూ జర్నలిజం విభాగం సీనియర్ ఆచార్యులు డీవీఆర్ మూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆచార్య మూర్తి ఏయూ పరీక్షలు విభాగం డీన్‌గా విధులను నిర్వహిస్తున్నారు. గతంలో ఈయన విదేశీ భాషలు విభాగాధిపతిగా, జర్మన్ సెంటర్ డైరెక్టర్, జర్నలిజం విభాగాధిపతిగా, బిఓఎస్ ఛైర్మన్‌గా పదవులు నిర్వహించారు.
Similar News
News November 25, 2025
అక్కడ ఆయన.. ఇక్కడ ఈయనపై విచారణ..!

తిరుమల వివాదాల్లో ఇద్దరు రాజకీయ నాయకులను ప్రత్యేక దర్యాప్తు బృందాలు విచారించాయి. కల్తీ నెయ్యి కేసులో HYDలో వైవీ సుబ్బారెడ్డిని సీబీఐ సిట్, పరకామణీ కేసులో తిరుపతిలో భూమన కరుణాకర్‌రెడ్డిని సీఐడీ విచారించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఎన్నడు లేనివిధంగా టీటీడీలో చోటుచేసుకున్న వివాదాలు.. మాజీ ఛైర్మన్ల విచారణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
News November 25, 2025
ప్రకాశంలోకి అద్దంకి, కందుకూరు.. కారణం ఇదే!

ప్రకాశం జిల్లా నుంచి సరికొత్త జిల్లాగా మార్కాపురం ఏర్పడనున్న నేపథ్యంలో మరో కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. 2022లో జరిగిన జిల్లాల పునర్విభజనలో ప్రకాశం నుంచి అద్దంకి బాపట్లలోకి, కందుకూరు నెల్లూరులోకి వెళ్లాయి. అద్దంకి నుంచి బాపట్లకు 80 కి. మీ ఉండగా ఒంగోలుకు 40 కి.మీ మాత్రమే. కందుకూరుకు ఇదే సుదూర సమస్య. తాజాగా వీటిని ప్రకాశంలోకి కలిపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ కామెంట్!