News April 11, 2024

ఆకట్టుకున్న ఈద్ ముబారక్ సైకత శిల్పం

image

ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం సమీపంలో బుధవారం శిల్పి గేదెల హరికృష్ణ నిర్మించిన సైకత శిల్పం పలువురిని ఆకట్టుకుంది. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఈ సైకత శిల్పం చేసినట్లు ఆయన చెప్పారు. పలువురు ముస్లిం సోదరులకు తన సైకత శిల్పం ద్వారా ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. శిల్పి హరికృష్ణ నైపుణ్యాన్ని పలువురు అభినందించారు

Similar News

News November 11, 2025

చిన్నారిపై లైంగిక దాడి.. వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు

image

నరసన్నపేట మండలానికి చెందిన రెండో తరగతి విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన వృద్ధుడు చల్లా రామ్మూర్తి (70) లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. విషయాన్ని విద్యార్థిని ఆమె తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం నిందితుడిపై కేసు నమోదు చేసి, వృద్ధుడిని ఆదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ దుర్గాప్రసాద్, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు తెలిపారు.

News November 11, 2025

విశాఖపట్నంలో గార మండల యువకుడు ఆత్మహత్య

image

విశాఖపట్నంలో గార మండలం కొర్లాం గ్రామానికి చెందిన యువకుడు నల్ల సంపత్ కుమార్ (32) సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థుల వివరాల మేరకు.. యువకుడు విశాఖ ద్వారక నగర్‌లో ఓ గదిలో అద్దెకి ఉంటూ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాడు. ఉద్యోగం రాకపోవడంతో మనస్థాపానికి గురైన అతను ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదం అలముకుంది.

News November 11, 2025

ఆత్మహత్య ఘటనలో ఇద్దరికి రిమాండ్: ఎస్ఐ

image

నందిగం మండలం తురకలకోట గ్రామానికి చెందిన ఎం.వెంకటరావు(34) అనే వ్యక్తి శనివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు నందిగం పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటరావును వేధించిన పెట్రోల్ బంక్ యజమాని బీ.రమేశ్‌తో పాటు అతనికి సహకరించిన ఒక హెడ్ కానిస్టేబుల్ ఇరువురుని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నందిగం ఎస్ఐ షేక్ మహమ్మద్ అలీ తెలిపారు.