News March 9, 2025
ఆకట్టుకున్న గద్వాల చేనేత ఉత్పత్తులు

దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో చేనేత కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శనలతో కూడిన వివిధ అమృత మహోత్సవ కార్యక్రమంలో గద్వాల చేనేత ఉత్పత్తులను ప్రదర్శించారు. ఉత్పత్తిదారులు అక్కల శాంతారాం, మంత్రి సురేష్, శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రదర్శించిన గద్వాల జరీ చీరల ప్రాముఖ్యతను ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, తెలంగాణ గవర్నర్ విష్ణు దేవ్ వర్మ, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలకు స్వయంగా వివరించారు.
Similar News
News March 24, 2025
పీజీఆర్ఎస్‌కు 203 దరఖాస్తులు వచ్చాయి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి నాణ్యతతో పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలో దాదాపు 30 వేల అర్జీలు పరిష్కరించామన్నారు. సోమవారం పీజీఆర్ఎస్‌కు 203 దరఖాస్తులు వచ్చాయన్నారు.
News March 24, 2025
వరంగల్: డ్రగ్స్, గంజాయిపై ఉక్కు పాదం: కలెక్టర్

వరంగల్ జిల్లాలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాల జిల్లా నిరోధక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. యువత భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్ గంజాయి వంటి మాదకద్రవ్యాల రవాణా వినియోగంపై అధికారులు తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. వీటి రవాణా ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి హైవేల వద్ద తనిఖీలు చేపట్టాలన్నారు.
News March 24, 2025
21 బంతుల్లో హాఫ్ సెంచరీ

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో లక్నో బ్యాటర్ మిచెల్ మార్ష్ వీర విహారం చేశారు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశారు. ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదారు. మరోవైపు పూరన్ సైతం ధాటిగా ఆడుతున్నారు. 7 ఓవర్లలో స్కోరు 89/1.