News July 10, 2024

ఆకాశవాణిలో ‘జంధ్యాల’ ధార్మిక బాణి

image

కేంద్రప్రభుత్వ నిర్వహణలోని శ్రేష్ఠ భారత్ కార్యక్రమాల్లో భాగంగా, సిక్కు సంప్రదాయ గురువుల గురించిన పది భాగాల ధారావాహికను విశాఖ ఆకాశవాణి రేడియో స్టేషన్ ప్రసారం చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే శ్రీకాకుళం రచయిత జంధ్యాల శరత్ బాబు ప్రసంగాల పరంపరను రికార్డు చేసింది. ఆ ధార్మిక ఉపన్యాసాలు వచ్చే ఆదివారం నుంచి సాయంత్రం వేళల్లో మొదలై, ప్రతీ వారం రెండున్నర నెలలపాటు ఉంటాయని ఏఐఆర్ ఉన్నతాధికారులు ప్రకటించారు.

Similar News

News December 27, 2025

31నే ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ: కలెక్టర్

image

శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 31న ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణంగా జనవరి 1న పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ, నూతన సంవత్సరం దృష్ట్యా అవ్వాతాతలకు ఇబ్బంది కలగకూడదని ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పంపిణీకి నిర్ణయించిందని పేర్కొన్నారు. లబ్ధిదారులందరూ ఈ మార్పును గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.

News December 27, 2025

శ్రీకాకుళం ఎంపీకి ప్రతిష్ఠాత్మక గౌరవం

image

భారతదేశంలో ప్రతిష్ఠాత్మకమైన ఔట్‌స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డుకు శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేరును శ్రీకాకుళం జేసీఐ సన్ రైజర్స్ ప్రతిపాదించింది. జేసీఐ బృంద సభ్యులు జేసి ప్రవీణ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో చెప్పారు. అవార్డును భారతదేశంలో ఉన్నత స్థానంలో ఉండి, తమ తమ రంగాలలో విశేషమైన సేవలు, కృషి చేసి 40 సంవత్సరాలలోపు ఉన్న యువ నాయకులకు మాత్రమే ప్రదానం చేయబడుతుందన్నారు.

News December 27, 2025

శ్రీకాకుళం: B.tech చదవి నకిలీ డాక్టర్ అవతారం

image

విశాఖ KGHలో డాక్టర్‌గా నమ్మించి కిడ్నీ బాధితుడి వద్ద లక్ష రూపాయలు వసూలు చేసిన <<18678274>>నిందితుడిని<<>> వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళానికి చెందిన బాధితుడు తన కుమారుడి చికిత్స కోసం ప్రకటన ఇవ్వగా, నిందితుడు జ్యోతి శివశ్రీ ‘డాక్టర్ నరసింహం’గా పరిచయం చేసుకుని మోసగించాడు. బి.టెక్ చదివి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఇతనిపై గతంలోనూ పలు దొంగతనాల కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.