News March 22, 2025

ఆకుల సేకరణకు వెళ్లి.. అనంత లోకాలకు..!

image

ఎటపాక మండలం చింతలపాడు గ్రామానికి చెందిన మడివి జ్యోతిలక్ష్మి(12) తునికి చెట్టు ఎక్కి ఆకుల సేకరణ చేస్తూ.. కింద పడి ఈనెల 17న గాయపడ్డారు. ఆమెను స్థానికులు లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు.

Similar News

News September 18, 2025

ఖమ్మం పార్కు, ఖిల్లా రోప్‌వే అభివృద్ధికి ₹18 కోట్లు

image

ఖమ్మంలోని వెలుగుమట్ల అర్బన్‌ పార్కు, ఖిల్లా రోప్‌వే అభివృద్ధికి ప్రభుత్వం ₹18 కోట్లు మంజూరు చేసింది. పురపాలక శాఖ కార్యదర్శి శ్రీదేవి ఈ మేరకు జీఓ నెం.51ని విడుదల చేశారు. వెలుగుమట్ల పార్కు అభివృద్ధి, నిర్వహణకు ₹3 కోట్లు, ఖిల్లా రోప్‌వే, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం ₹15 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో జిల్లాలో పర్యాటకం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

News September 18, 2025

ఖమ్మం: వైద్య ఆరోగ్యంపై Dy.CM సమీక్ష

image

ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో Dy.CM మల్లు భట్టి విక్రమార్క వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షించారు. జిల్లాలోని ప్రభుత్వ, 627 ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలకు అంకితభావంతో సేవలందించాలని ఆయన ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించి, జిల్లా స్థాయిలో కోఆర్డినేటర్ల ద్వారా మానిటరింగ్ కొనసాగుతోందని తెలిపారు. ఆధునిక సౌకర్యాలు కల్పించి, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్ట నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

News September 18, 2025

అంధుల పాఠశాల నిర్మాణానికి పక్కా ప్రణాళిక

image

ఖమ్మం జిల్లాలో అంధుల కోసం పాఠశాల నిర్మాణానికి పక్కా ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అంధుల స్కూల్‌ ఏర్పాటుపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ డా.పి.శ్రీజ, జడ్పీ సీఈఓ, విద్యాశాఖ అధికారులతో చర్చించారు. త్వరలోనే పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు.