News March 13, 2025

ఆక్రమణలకు గుర్తింపు పొందేందుకు ఉత్వర్వులు: కలెక్టర్

image

ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ది 15.10.2019 లోపు ఇళ్లు నిర్మించుకొని ఉన్న ఆక్రమణలకు గుర్తింపు పొందుటకు ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఇచ్చారని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. అర్హత గల ఆక్రమణదారులు వారి ఇళ్లను క్రమబద్ధీకరించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తును ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. 31 డిసెంబర్ 2025 లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

Similar News

News November 13, 2025

రంగు మారిన ధాన్యాన్ని బేషరతుగా కొనాలి: కలెక్టర్

image

కొండగట్టు జేఎన్టీయూ ఆవరణలో జగిత్యాల జిల్లా రైస్ మిల్లుల ఓనర్స్ అసోసియేషన్ సభ్యులతో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోళ్లల్లో అలసత్వం వహించొద్దని, తాలు పేరుతో ఎటువంటి కోతలు పెట్టకుండా రంగు మారిన ధాన్యాన్నీ బేషరతుగా కొనుగోలు చేయాలని అదేశించారు. రైతులను ఇబ్బందులకు గురిచేయద్దన్నారు.

News November 13, 2025

ఏలూరు జిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు

image

ఏలూరు జిల్లా అంతటా పోలీసు బృందాలు బుధవారం రాత్రి వేళల్లో వాహనాలను తనిఖీ చేశాయి. గంజాయి, అక్రమ మద్యం, డ్రగ్స్ వంటి నిషేధిత వస్తువులు” రవాణా కాకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటూ జిల్లా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజల భద్రత కోసం ఈ తనిఖీలు కొనసాగనున్నాయని పోలీసులు తెలిపారు.

News November 13, 2025

గుడివాడకు జనవరి 12వ తేదీ నుంచి వందే భారత్ రైలు

image

చెన్నై-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవను గుడివాడ జంక్షన్, భీమవరం టౌన్ మీదుగా నరసాపురం వరకు జనవరి 12వ తేదీ నుంచి పొడిగిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విస్తరణతో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు ఇది ఎంతో ప్రయోజనకరం కానుంది.