News February 1, 2025
ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ: హోం మంత్రి అనిత

రాష్ట్రంలో అభ్యంతరం లేని ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు కూటమి ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేసినట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత శుక్రవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 2019 అక్టోబర్ 15వ తేదీ కంటే ముందున్న వాటికి వర్తింప చేయనున్నట్లు తెలిపారు. గతంలో జారీచేసిన ఉత్తర్వులను పక్కన పెడుతూ కొత్తగా జీఓ నంబర్ 30 జారీ చేసినట్లు వివరించారు. 150 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ జరుగుతుందన్నారు.
Similar News
News February 7, 2025
సిద్దిపేట: నులి పురుగుల దినోత్సవం విజయవంతం చేయాలి: కలెక్టర్

1 నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను వేయించి జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ మనుచౌదరి సూచించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్ హల్‌లో ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ వారు జారీ చేసిన జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవ అవగాహన పోస్టర్ పోస్టర్‌ని ఆవిష్కరించారు.
News February 7, 2025
CSR సమ్మిట్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు

ఈనెల 16న శిల్పకళావేదికలో జరిగే సౌత్ ఇండియా CSR సమ్మిట్ పోస్టర్‌ను మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. సమ్మిట్‌లో వెయ్యి కార్పొరేట్ సంస్థలు, 2వేల మంది NGO’S, పబ్లిక్ ఎంటర్ ప్రైజేస్‌ల ప్రతినిదులు పాల్గొంటారని తెలిపారు. వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి 50 కేటగిరిల్లో సేవా అవార్డులు ఇవ్వనున్నారు. సమ్మిట్ లైసెన్సీ వినీల్ రెడ్డి, TDF ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు.
News February 7, 2025
పలు ఉన్నత ఆశ్రమ పాఠశాలను సందర్శించిన MHBD కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్న ఉన్నత ఆశ్రమ పాఠశాల రెసిడెన్షియల్ స్కూల్స్, ఏకలవ్య మోడల్ స్కూల్స్‌ను జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారమే పరిశుభ్రంగా ఉండే బోజనం అందించాలని అన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ పరిసరాల ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.