News September 6, 2024
ఆగస్టు నెలలో రూ.125.67 కోట్ల హుండీ ఆదాయం
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఆగస్టు నెలలో రూ.125.67 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది. గత నెలలోనే దాదాపు 22.42 లక్షల మంది భక్తులు కొండ గుడిలో పూజలు చేశారని ఈవో జే.శ్యామలరావు తెలిపారు. లడ్డూలు రూ.1.06 కోట్లకు అమ్ముడయ్యాయని చెప్పారు. 24.33 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించగా.. 9.49 లక్షల మంది తలనీలాలు సమర్పించారన్నారు.
Similar News
News October 5, 2024
వకుళామాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించిన చంద్రబాబు
తిరుమల పాంచజన్యం వెనుక నూతనంగా నిర్మించిన వకుళామాత కేంద్రీయ వంటశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సుమారు రూ.13.45 కోట్లతో ఈ భవనం నిర్మించారు. 1.20 లక్షల మంది భక్తులకు సరిపడే విధంగా భోజన సౌకర్యాలు కల్పించనున్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పాల్గొన్నారు.
News October 5, 2024
సీఎం చంద్రబాబు తిరుమల పర్యటనలో స్వల్ప మార్పు
శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు తిరుమలకు వచ్చిన సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం వకుళమాత నూతన కేంద్రీకృత వంటశాలను ప్రారంభించి తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. అయితే టీటీడీ అధికారులతో సమావేశం అయి తర్వాత తిరుగు ప్రయాణం కానున్నారు. లడ్డూ వ్యవహారం అనంతరం సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
News October 5, 2024
మదనపల్లె: ఒంటరి మహిళపై బండరాళ్లతో దాడి
పాత కక్షలతో ప్రత్యర్థులు ఇంట్లో ఒంటరిగా ఉన్న వితంతు మహిళపై పైశాచిక దాడికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి మదనపల్లె మండలం రాయనిచెరువు వడ్డీపల్లిలో జరిగిన ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామానికి చెందిన ఆదిలక్ష్మికి అదే ఊరిలో ఉండే గంగులప్పకు ఇంటి విషయమై గొడవలున్నాయి. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆదిలక్ష్మిపై గంగులప్ప వర్గీయులు బండరాళ్లతో శుక్రవారం రాత్రి దాడిచేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.