News July 22, 2024

ఆగస్టు 1 నుంచి బీఆర్క్ సెమిస్టర్ పరీక్షలు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని బిఆర్క్ సెకెండ్ ఇయర్ రెండో సెమిస్టర్ పరీక్షలను ఆగస్టు ఒకటి నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ రిజిస్ట్రార్ (పరీక్షలు) జె.రత్నం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. సబ్జెక్టుల వారిగా పరీక్షా తేదీలను ఆంధ్ర విశ్వవిద్యాలయం వెబ్ సైట్‌లో ఉంచినట్లు వెల్లడించారు.

Similar News

News November 18, 2025

రేపే దీపోత్సవం.. ఏర్పాట్లు పూర్తి

image

పద్మనాభంలో వేంచేసి ఉన్న శ్రీఅనంతపద్మనాభ స్వామి దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు సాయంత్రం 5:30లకు జైగంట మోగగానే మెట్లకి ఇరువైపులా దీపాలు వెలిగించే కార్యక్రమం మొదలవుతుంది. ఆ సమయంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలి.

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న బాలకృష్ణ

image

సింహాచలం దేవస్థానంలో అప్పన్న స్వామిని సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ దర్శించుకున్నారు. మంగళవారం సింహాచలం వచ్చిన బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనుని ఏఈవో తిరుమల ఈశ్వరరావు, వేద పండితులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. సాయంత్రం అఖండ-2 సినిమా సాంగ్‌ను విడుదల చేయనున్నారు.