News July 20, 2024

ఆగస్టు 12,13 తేదీల్లో MCA 4వ సెమిస్టర్ పరీక్షలు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో MCA 4వ సెమిస్టర్ పరీక్షలను ఆగస్టు 12,13 వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు. పరీక్షల విభాగం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఆగస్టు 12న డేటాసైన్స్, ఆగస్టు 13న సెలెక్టివ్-2 గా ఐఓటీ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ కంప్యూటింగ్ పరీక్షలు నిర్వహిస్తారు.

Similar News

News December 4, 2025

విశాఖ చేరుకున్న మంత్రి లోకేశ్

image

విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి లోకేశ్‌కు ఉత్తరాంధ్ర టీడీపీ, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ప్రజలు, కార్యకర్తలను కలిసిన వారి వద్ద నుంచి లోకేశ్ అర్జీలు స్వీకరించారు. అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు. విశాఖ నుంచి రోడ్డుమార్గంలో పార్వతీపురం జిల్లా భామిని గ్రామానికి చేరుకుంటారు. అనంతరం టీడీపీ నాయకులుతో సమవేశం నిర్వహిస్తారు. రాత్రికి ఆదర్శ పాఠశాలలో బస చేస్తారు.

News December 4, 2025

ఈఎస్ఐ గేటు వద్ద మృతదేహంతో ఆందోళన

image

ఈఎస్ఐ గేటు వద్ద కూర్మన్నపాలేనికి చెందిన మహిళ మృతి చెందడంతో బంధువులు, కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. ఈఎస్ఐ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే పార్వతి చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. గైనిక్ ప్రాబ్లం కావడంతో పార్వతి ఆసుపత్రిలో జాయిన్ కాగా పరిస్థితి విషమించటంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. దీంతో బంధువులు మృతదేహాన్ని గేటు వద్దకు తెచ్చి ఆందోళన చేపట్టారు

News December 4, 2025

విశాఖ: రక్షణలేని ఉక్కు నిర్వాసితుల స్థలాలు

image

ఉక్కు పరిశ్రమ నిర్వాసితుల కోసం కేటాయించిన స్థలాల్లో కబ్జాదారులు చొరబడుతున్నారు. ఇటీవల గాజువాకలోని వికాస్‌ నగర్ ITI రోడ్డు వద్ద సర్వే నంబర్ 153 భూమిలో రాత్రికి రాత్రే 18 షెడ్లు నిర్మించేందుకు ప్రయత్నించగా.. అధికారులు అడ్డుకున్నారు. బీసీ రోడ్డు శివాలయం దగ్గర ఆరేళ్లుగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. చివరకు అధికారులు నిర్మాణాలను తొలగించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.