News August 12, 2024
ఆగస్టు 15న ఉయ్యూరు రానున్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు ఆగస్టు 15న ఉయ్యూరులో పర్యటించనున్నారు. 15వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు సీఎం చంద్రబాబు ఉయ్యూరులో అన్న క్యాంటీన్ను ప్రారంభించనున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్లను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
Similar News
News December 7, 2025
మహానటి సావిత్రి పేరిట కళ్యాణ మండపం నిర్మాణం: MP బాలశౌరి

మహానటి సావిత్రి పేరుతో ఆమె జన్మస్థలమైన గుంటూరు జిల్లా చిర్రావూరులో కళ్యాణ మందిరం నిర్మించనున్నట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. NTPC వారి సీఎస్ఆర్ నిధులు కింద రూ. 2కోట్లు మంజూరు చేశారన్నారు. గతంలో తాను తెనాలి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో చిర్రావూరులో సావిత్రి పేరిట కళ్యాణ మండపం నిర్మించాలని సంకల్పించినట్లు తెలిపారు.
News December 7, 2025
కృష్ణా: స్క్రబ్ టైఫస్తో వ్యక్తి మృతి

ఉయ్యూరు మండలం ముదునూరుకి చెందిన శివశంకర్ స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మరణించారు. ఈ నెల 2న శాంపిల్స్ తీసుకోగా, రిపోర్ట్ రాకముందే 4వ తేదీన ఆయన మృతి చెందారు. శనివారం వచ్చిన రిపోర్టుల్లో ఆయనకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మృతుడికి కిడ్నీ సమస్య కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో జిల్లా వైద్య బృందం సర్వే చేపట్టింది.
News December 6, 2025
కృష్ణా జిల్లాలో 12 స్క్రబ్ టైఫస్ పాజిటీవ్ కేసులు: కలెక్టర్

జిల్లాలో 12 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదైనట్టు కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఈ కేసులు నమోదయ్యాయన్నారు. వ్యవసాయ పనులు చేసుకునే గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తుందన్నారు. అనుమానిత, ధృవీకృత కేసులపై ప్రత్యేకంగా ఇంటింటి సర్వేల ద్వారా పర్యవేక్షిస్తునట్లు తెలిపారు.


