News August 12, 2024

ఆగస్టు 15న ఉయ్యూరు రానున్న సీఎం చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు ఆగస్టు 15న ఉయ్యూరులో పర్యటించనున్నారు. 15వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు సీఎం చంద్రబాబు ఉయ్యూరులో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించనున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్లను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

Similar News

News September 11, 2024

సుప్రీం కోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి జోగి రమేశ్

image

సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో తన ముందస్తు బెయిల్ పిటీషన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి జోగి రమేశ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వైసీపీ అధికారంలో ఉండగా జోగి రమేశ్ చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లారని పలువురు టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వ మార్పిడి తర్వాత రమేశ్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

News September 11, 2024

సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనలో మరో వ్యక్తి అరెస్టు

image

సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో పాలడుగు దుర్గాప్రసాద్‌ను మంగళగిరి పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. దుర్గాప్రసాద్ ఈ కేసులో ఏ4గా నిందితుడిగా ఉన్నాడు. దుర్గాప్రసాద్ కోసం కొంతకాలంగా గాలిస్తున్న పోలీసులు.. ఇవాళ గుంటుపల్లిలో ఆయన ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. కాగా దుర్గాప్రసాద్ సతీమణి ఎంపీపీ పాలడుగు జోష్న వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.

News September 11, 2024

పులిగడ్డ గురుకుల పాఠశాలను సందర్శించిన డీఎంహెచ్‌వో

image

అవనిగడ్డ మండలం పులిగడ్డలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు జ్వరాలు ప్రబలిన నేపథ్యంలో డీఎంహెచ్వో గీతాబాయి పాఠశాలను సందర్శించారు. ప్రిన్సిపల్ కుమార్‌ను, వైద్యులు డా. ప్రభాకర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం రాత్రి వరకు జరిగిన పరీక్షల్లో మొత్తం 31 మంది జ్వర పీడితులు తేలారని, వారిలో ముగ్గురు తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఉండగా, మరో ఆరుగురు చికిత్స కోసం ఇళ్లకు వెళ్లిపోయినట్లు ఆమె తెలిపారు.