News August 14, 2024

ఆగస్టు 15: హైదరాబాద్‌లో హై అలర్ట్

image

పంద్రాగస్టు నేపథ్యంలో‌ నగరంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆంక్షలు విధించారు. జంటనగరాల్లో కీలకమైన సికింద్రాబాద్‌లోనూ నిఘా పెంచారు. మంగళవారం రాత్రి మార్కెట్ పోలీసులు పలు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్ ఆధ్వర్యంలో 31 బస్టాప్ తదితర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులను అపి సోదాలు చేశారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Similar News

News October 20, 2025

బల్కంపేట ఎల్లమ్మ గుడిలో దీపావళి పూజలు

image

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు, అందమైన పూలతో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపావళి ప్రత్యేక హారతి, ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. దీప కాంతులతో ఆలయం రూపుదిద్దుకుంది. ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

News October 20, 2025

హైదరాబాద్ ఊపిరిపీల్చుకో..!

image

పండగలొస్తే నగరం కొత్తగా కనిపిస్తుంది. బహుశా ఇలా అనుకుంటుందేమో? ఉదయాన్నే హారన్‌ల మోతలేక హాయిగా నిద్రలేచి సరికొత్త సూర్యోదయం చూశా. బండ్లు ఎక్కువగా తిరగక, కంపెనీలన్నీ బంద్ అవ్వడంతో స్వచ్ఛమైన గాలి గుండెల నిండా పీల్చుకుంటున్నా. మెట్రో, బస్సుల్లో తిట్ల దండకాలు లేవు. ఉరుకులు పరుగులతో ప్రశాంతతలేని ముఖాలు కానరాలేదు. ఇలాంటి పండగల రోజు మళ్లా ఎన్నిరోజులకో..? అని ఎదురుచూస్తున్నట్లు మీకూ అనిపిస్తోందా!

News October 20, 2025

21న పోలీస్ అమరవీరుల సంస్మరణకు సీఎం రేవంత్: డీజీపీ

image

అక్టోబర్ 21 గోషామహల్ పోలీస్ స్టేడియంలో జరిగే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమానికి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి హాజరవనున్నారని డీజీపీ శివధర్ తెలిపారు. కార్యక్రమం ఉ.9.30 గంటలకు ప్రారంభమవుతుందని ఆయన ప్రకటించారు. అక్టోబర్ 21- 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.