News July 31, 2024
ఆగస్టు 2న సాగర్ ఎడమ కాల్వకు నీరు విడుదల

ఎగువ నుంచి వరద ఉద్ధృతి ప్రాజెక్టులోకి వస్తుండటంతో నాగార్జునసాగర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు 1.79 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. నీటిమట్టం 518 అడుగులు, 145 టీఎంసీలుగా ఉంది. భారీ ఇన్‌ఫ్లోతో రోజూ 20 టీఎంసీలకు పైగా నీరు ప్రాజెక్టులోకి చేరనుంది. ప్రాజెక్టులోకి భారీ ఇన్‌ఫ్లో నేపథ్యంలో ఆగస్టు 2న ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయనున్నారు.
Similar News
News December 15, 2025
చిట్యాల: రిగ్గింగ్ జరిగందంటూ ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు

చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌లో అవకతవకలు, పోలింగ్‌లో రిగ్గింగ్ జరిగిందని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రుద్రారపు భిక్షపతి ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేశారు. తన గుర్తుపై ఓటేసిన బ్యాలెట్ పేపర్లు డ్రైనేజీలో పడేసి లెక్కింపులో అవకతవకలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
News December 15, 2025
నల్గొండ: ముగిసిన ప్రచారం.. ఎల్లుండి భవిత్యం..!

నల్గొండ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు దేవరకొండ డివిజన్లో జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటలతో ముగిసింది. డివిజన్లోని మొత్తం 9 మండలాల్లో 269 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే 42 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈనెల 17న 227 పంచాయతీల్లో జరిగే పోలింగ్‌లో ఇదే సమయానికి బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థుల భవిత్యం తేలనుంది. మొత్తం 2,81,321 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
News December 15, 2025
మర్రిగూడ: సాఫ్ట్వేర్ to సర్పంచ్

సొంతూరుకు సేవ చేయాలనే తపనతో మర్రిగూడకు చెందిన వీరమల్ల శిరీష అనే వివాహిత సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదులుకొని సర్పంచ్‌గా ఎన్నికయింది. శిరీష ఎంటెక్ పూర్తి చేసి ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.


