News July 24, 2024

ఆగస్టు 4లోగా ఫీజు చెల్లించాలి: జయశ్రీ

image

వచ్చేనెల 4వ తేదీలోగా డిప్లమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ 2018–20 బ్యాచ్‌లో మేనేజ్‌మెంట్‌, స్పాట్‌ అడ్మిషన్లలో మొదటి సంవత్సరం ఒకసారి ఫెయిలైన అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని తూ.గో జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ ప్రిన్సిపల్‌ జయశ్రీ తెలిపారు. పరీక్ష ఫీజును సంబంధిత ప్రభుత్వ, ప్రైవేటు డీఈఎల్‌ఈడీ కళాశాలల ప్రిన్సిపల్స్‌కు చెల్లించాలన్నారు. వివరాలకు సంబంధిత ప్రిన్సిపల్స్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News November 2, 2025

1,185 కుటుంబాలకు రూ.23.26 లక్షల సాయం: కలెక్టర్

image

తూర్పుగోదావరి జిల్లాలో 1,185 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.23.26 లక్షల ప్రత్యేక ఆర్థిక సహాయం అందజేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘మొంథా’ తుపాను ప్రభావంతో నష్టపోయిన కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో మండల స్థాయిలో లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.

News November 2, 2025

తాళ్లపూడిలో నేటి చికెన్ ధరలు ఇలా

image

కార్తీక మాసం కారణంగా తాళ్లపూడి మండలంలో మాంసం విక్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. ఆదివారం నాటికి కిలో చికెన్ రూ.200-220 పలుకుతుండగా, నాటుకోడి రూ.600, మేక మాంసం రూ.800 చొప్పున విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులు గణనీయంగా తగ్గడంతో వ్యాపారం మందగించిందని వ్యాపారులు చెబుతున్నారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయగలరు.

News November 1, 2025

పుష్కర కాలువలో దూకి యువకుడి ఆత్మహత్య

image

గోకవరం మండలం తంటికొండకు చెందిన కామిశెట్టి పుష్ప భగవాన్ (35) పుష్కర కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ శనివారం తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.