News November 9, 2024

ఆగిరిపల్లి: పెళ్లికాని వారికి ఈ ఆలయం వరం

image

కృష్ణాజిల్లా ఆగిరిపల్లిలో స్వయంభూగా వెలసిన వ్యాఘ్ర నరసింహుడు కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తులు చెబుతున్నారు. కృతయుగంలో మహారాజు శుభవ్రత మహావిష్ణువుకోసం తపస్సు చేస్తే స్వామి ఇక్కడ వెలిశాడని ప్రతీతి. వివాహం కానివారు ఇక్కడ శాంతి కళ్యాణం చేయిస్తే పెళ్లి కుదురుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ ఆంజనేయుడు క్షేత్రపాలకుడిగా యోగముద్రలో దర్శనమిస్తాడు. శివరాత్రి, కార్తీక మాసంలో ఇక్కడ దీపోత్సవం నిర్వహించడం విశేషం.

Similar News

News December 12, 2024

మచిలీపట్నం: మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం

image

రాష్ట్ర మైన్స్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం నెలకొంది. మంత్రి రవీంద్ర సోదరుడు కొల్లు వెంకట రమణ (64) బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. గుండెపోటుకు గురైన వెంకట రమణను హుటాహుటిన ఆంధ్ర ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సోదరుడి మరణ వార్త తెలుసుకున్న మంత్రి రవీంద్ర విజయవాడ నుండి మచిలీపట్నం బయలుదేరారు. మరికాసేపట్లో మంత్రి మచిలీపట్నం రానున్నారు.

News December 11, 2024

మచిలీపట్నం: పేర్ని నాని సతీమణిపై నమోదైన సెక్షన్లు ఇవే..

image

మాజీ మంత్రి, వైసీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు పేర్ని వెంకట్రామయ్య (నాని) సతీమణి జయసుధ, ఆయన వ్యక్తిగత కార్యదర్శి మానస తేజపై బందరు తాలుకా PSలో కేసు నమోదైంది. జయసుధ పేరిట ఉన్న గోడౌన్లో 185 టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్టు సివిల్ సప్లయిస్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలుకా పోలీసులు వీరి ఇరువురిపై 316 (3), 316 (5), 61 (2) రెడ్ విత్ 3 (5) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 11, 2024

VJA: ప్రయాణికులను మోసం చేస్తున్న నలుగురు అరెస్ట్

image

ప్రయాణికులను ఏమార్చి దొంగతనాలు చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు విజయవాడ పోలీసులు వెల్లడించారు. ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ సురేష్, తారకేశ్వరరావు, కంబల శ్రీను, రాజు అనే వ్యక్తులు బస్టాండ్‌ల వద్ద ప్రయాణికులను మోసం చేస్తూ ఉంటారన్నారు. ఫిర్యాదులు రావడంతో నిఘా పెట్టి వీరిని పట్టుకున్నామని చెప్పారు. వారి నుంచి రూ.1,50,000 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు.