News February 11, 2025

ఆగిరిపల్లి: ప్రమాదంలో నలుగురికి గాయాలు

image

ఆగిరిపల్లి మండలం వట్టిగుడుపాడు గ్రామంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. మధుమోహనరావు, వెంకటేశ్వరరావు, మనోహరం, అభిలాష్ లు  ప్రమాదంలో గాయపడినట్లు హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు తెలిపారు. నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు.

Similar News

News November 20, 2025

కోయిలకొండ: ఎంపీడీవోల యూనియన్ అధ్యక్షుడిగా ధనుంజయ గౌడ్

image

మహబూబ్ నగర్ జిల్లాలో నూతన ఎంపీడీవోల యూనియన్ కార్యవర్గం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా (కోయిలకొండ) ఎంపీడీవో ధనుంజయ గౌడ్ ఎంపికయ్యారు. ఉపాధ్యక్షుడిగా (నవాబ్ పేట) ఎంపీడీవో జయరాం నాయక్, జనరల్ సెక్రటరీగా (MBNR) కరుణశ్రీ, కోశాధికారిగా (హన్వాడ) ఎంపీడీవో యశోదమ్మ, అసోసియేటెడ్ అధ్యక్షుడిగా (జడ్చర్ల) ఎంపీడీవో విజయ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా(భూత్పూర్) ఎంపీడీవో ఉమాదేవి, ఇతర సభ్యులను ఎన్నుకున్నారు.

News November 20, 2025

వేములవాడలో మరిన్ని సూచిక బోర్డుల ఏర్పాటు

image

వేములవాడ పుణ్యక్షేత్రంలో అధికారులు కొత్తగా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. భీమేశ్వర ఆలయంలో దర్శనాల నేపథ్యంలో దారితెలియక భక్తులు తికమకపడుతున్నారు. దీనికి తోడు అభివృద్ధి పనుల కారణంగా పలుచోట్ల ట్రాఫిక్‌ను మళ్లించి ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో తిప్పాపూర్ బ్రిడ్జితో పాటు పట్టణంలోకి ప్రవేశించే రోడ్లు, ముఖ్య కూడళ్ల వద్ద ముఖ్యమైన ప్రాంతాలకు దారులను సూచిస్తూ పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

News November 20, 2025

వికారాబాద్ కోర్టు చరిత్రలో తొలి సంచలన తీర్పు

image

VKB జిల్లా కోర్టు చరిత్రలో మొదటిసారిగా ఉరిశిక్షను విధిస్తూ గురువారం డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి సంచలన తీర్పు వెలువరించారు. హత్యకు గురైన ఘటన 2019 ఆగస్టు 5న VKBలో చోటుచేసుకుంది. గృహ కలహాల నేపథ్యంలో నిందితుడు ప్రవీణ్ కుమార్ భార్యతో పాటు ఇద్దరు పిల్లలను దారుణంగా హతమార్చాడు. కేసు నమోదు చేసి పోలీసులు సమగ్ర విచారణ జరిపి ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. కోర్టు నిందితుడికి కఠినమైన శిక్షను విధించింది.