News January 11, 2025

ఆచంటలో పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఆలయం!

image

ఆచంటలోని పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఆలయం తిరునాళ్ల నిర్వహణకు ముస్తాబవుతోంది. సంక్రాంతి పర్వదినాల్లో ఈ ఆలయంలో తీర్థవ ఘనంగా జరుగుతుంది. కొత్తగా పెళ్లైన దంపతులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. పూర్వం ఓ నవ జంట ఇక్కడ చనిపోయింది. పాము కాటు వేయడంతో భర్త చనిపోయాడని భార్య స్థానిక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఊర్లో పంటలు సరిగా పండకపోవడంతో వారికి ఇక్కడ గుడి కట్టినట్లు గ్రామస్థులు చెబుతారు.

Similar News

News January 11, 2025

ప.గో: విమాన ధరలతో పోటీ పడుతున్న బస్సు ధరలు

image

సంక్రాంతి కోసం సొంత గ్రామాలకు నగరవాసులు తరలిరావడంతో ప్రెవేట్ బస్ ఛార్జీలు విమాన ధరలతో పోటీ పడుతున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు శని, ఆదివారాలు వీకెండ్ 13,14,15 తేదీలు వరుసగా సంక్రాంతి సెలవులు కావడంతో ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో పాలకొల్లు, భీమవరం, నరసాపురం పట్టణాలకు వచ్చేందుకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి టికెట్ ధరలు సాధారణంగా వెయ్యి లోపు ఉంటే ఇప్పుడు రూ.3వేల నుంచి 5 వేలకు పెరిగాయి.

News January 11, 2025

చింతలపూడి తహశీల్దార్‌కు ఏలూరు జిల్లాలో సెకండ్ ర్యాంకు

image

విధి నిర్వహణ, పనితీరు ఆధారంగా చింతలపూడి మండల తహశ్దీలార్ డి. ప్రమద్వార ఏలూరు జిల్లాలో ద్వితీయ ర్యాంకు సాధించారు. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులు ప్రమద్వారను అభినందించారు. జిల్లాలో పనితీరు ఆధారంగా ద్వితీయ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందని ఈ విజయం సాధించడానికి సహకరించిన ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, ఉన్నతాధికారులు, చింతలపూడి మండల రెవెన్యూ సిబ్బందికి కృతజ్ఞతలన్నారు.

News January 10, 2025

సూర్య‌ఘ‌ర్ పథకానికి కేంద్రం సబ్సిడీ: కలెక్టర్

image

విద్యుత్ బిల్లుల‌ నుంచి విముక్తి పొంద‌డానికి చ‌క్క‌ని ప‌రిష్క‌ారం ప్ర‌ధాన‌మంత్రి సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కం అని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తున్న స‌బ్సిడీతో ఇప్ప‌డు సోలార్‌ రూఫ్‌ టాప్ పథ‌కం సామాన్యుల‌కు సైతం అందుబాటులోకి వ‌చ్చిందన్నారు. ఈ మేరకు భీమవరం ఆమె కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. పీఎం సూర్య ఘర్ పోర్టల్ pmsuryaghar.gov.inలో దీని కోసం రిజిస్టర్ చేసుకోవాలన్నారు.