News October 9, 2024
ఆచంట: బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి
ఆచంట వేమవరానికి చెందిన బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు వివాహిత షేక్ రజియా(33) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె స్థానికంగా బ్యూటీ పార్లర్ నిర్వహిస్తుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుంది. భర్త సిలార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆచంట ఎస్ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Similar News
News November 5, 2024
ఏలూరు: ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్ట్
ఏలూరు జిల్లాతో పాటు పలు ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలిపారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ద్విచక్రవాహనాల దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఈ క్రమంలో పూతి ప్రసాద్ , అప్పల నాయుడు, నాగాంజనేయులు అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుని రూ.17,50,000 విలువ గల 25 వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
News November 5, 2024
ప.గో: పేలుడు ఘటనలో మరొకరు మృతి
ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో గత నెల 30న జరిగిన బాణసంచా తయారీ కేంద్రంలోని పేలుడు ఘటనలో మరొకరు మరణించారు. పెంటపాడు మండలం రావిపాడుకు చెందిన మందలంక కమలరత్నం(47) ఏలూరులో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఈ ప్రమాదంలో అదే రోజు ఇద్దరు మృతిచెందగా.. అనంతరం మరొకరు ప్రాణాలు విడిచారు. రత్నం మృతితో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది.
News November 5, 2024
జాతీయస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ఇద్దరు ఎంపిక
ఈనెల 18 నుంచి 22 వరకు ఛత్తీస్ ఘడ్ రాష్టంలోని రాజనందిగంలో జరుగు 68వ జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాల బాలికల పోటీలకు పశ్చిమ గోదావరి నుంచి ఇద్దరు ఎంపిక అయ్యారు. ఏలూరు కస్తూరిబా మున్సిపల్ పాఠశాలకు చెందిన ఎం.యోగశ్రీ, దెందులూరు మండలం కొవ్వలి ఉన్నత పాఠశాలకు చెందిన చార్లెస్ వెస్లీ ఎంపికయ్యారు. వీరిని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అభినందించారు.