News June 4, 2024
ఆచంట 4వ రౌండ్ కంప్లీంట్.. TDP లీడ్ ఎంతంటే

ఆచంట నియోజకవర్గంలో 4వ రౌండ్ పూర్తయ్యేసరికి కూటమి MLA అభ్యర్థి పితాని సత్యనారాయణ 24895 ఓట్లు సాధించగా.. 6581 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. కాగా ఇక్కడ వైసీపీ నుంచి బరిలో ఉన్న చెరుకువాడ శ్రీ రంగనాథ రాజుకు 18314 ఓట్లు వచ్చాయి.
Similar News
News November 24, 2025
భీమవరం: మానసిక రోగుల గుర్తింపుపై పోస్టర్ ఆవిష్కరణ

మానసిక రోగుల గుర్తింపు, చికిత్స, పునరావాసం కోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మనోబంధు ఫౌండేషన్ రూపొందించిన పోస్టర్ను ఎస్పీ నయీం అస్మి ఆవిష్కరించారు. సోమవారం ప.గో జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సమాజంలో మానసిక రుగ్మతలు పెరుగుతున్నాయని, కొన్ని సందర్భాల్లో వీరి వల్ల నేరాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు బాధ్యత తీసుకోవడం అభినందనీయమన్నారు.
News November 24, 2025
దివ్యాంగురాలి దగ్గరకు వెళ్లి అర్జీ తీసుకున్న ప.గో కలెక్టర్

అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తమ పరిధిలో లేని వాటిని సంబంధిత శాఖలకు పంపి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కాగా, ఓ దివ్యాంగురాలు అర్జీ ఇచ్చేందుకు రాగా.. కలెక్టర్ స్వయంగా ఆమె వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.
News November 24, 2025
తణుకులో సందడి చేసిన OG హీరోయిన్

సినీ హీరోయిన్ ప్రియాంక మోహన్ సోమవారం తణుకులో సందడి చేశారు. స్వయంభు కపర్ధేశ్వర స్వామి వారిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమె వెంట ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ భమిడి అఖిల్, ఘనపాటి భమిడి సీతారామకృష్ణావధానులు ఉన్నారు.


