News February 3, 2025

ఆజామ్ జాహి మిల్లుపై మావోయిస్టు పార్టీ లేఖ

image

వరంగల్ ఆజామ్ జాహి మిల్లు వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేశ్ పేరుతో ములుగు జిల్లాలో లేఖ కలకలం సృష్టిస్తోంది. భూములపై పూర్తి హక్కు కార్మికులకు, వారి కుటుంబాలకు దక్కే వరకు పోరాటాలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. 2002లో 451 మంది కార్మికులకు బలవంతంగా వీఆర్ఎస్ ఇచ్చి మిల్లును మూసివేశారని తెలిపారు.

Similar News

News January 22, 2026

ట్రంప్‌కు EU కౌంటర్.. ట్రేడ్ డీల్ ఫ్రీజ్

image

గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకోవాలన్న US అధ్యక్షుడు ట్రంప్ మొండి వైఖరికి EU కౌంటరిచ్చింది. యూరప్ దేశాలపై ఆయన సంధించిన టారిఫ్స్ అస్త్రాన్ని తిప్పికొట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. USతో ట్రేడ్ డీల్‌కు ఆమోదం తెలపకుండా EU పార్లమెంట్ ఫ్రీజ్ చేసింది. డీల్‌లో భాగంగా రానున్న రోజుల్లో అమెరికా వస్తువులపై టారిఫ్స్ ఎత్తేసేందుకు ఓటింగ్ జరపాల్సి ఉంది. కానీ ట్రేడ్ డీల్ నిలిపివేయడంతో ఓటింగ్ జరిగే పరిస్థితి లేదు.

News January 22, 2026

మేడారం: 76589 12300 నంబర్​‌తో వివరాలు పొందండి!

image

మేడారం జాతరకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు 76589 12300 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపడం ద్వారా జాతర వివరాలను తెలుసుకోవడంతో పాటు పలు రకాల సేవలను పొందవచ్చని తెలిపింది. అంటే జాతర రూట్ మ్యాప్, ట్రాఫిక్ అప్‌డేట్స్, పార్కింగ్, వైద్య కేంద్రాలు, స్నాన ఘట్టాలు సహా ఇతర వివరాలు నేరుగా వాట్సాప్‌లోనే లభిస్తాయి.

News January 22, 2026

GNT: మూడేళ్ల పరారీకి చెక్.. అత్యాచార నిందితుడు అరెస్ట్

image

అత్యాచార కేసులో నిందితుడిగా ఉండి 3 సంవత్సరాల నుంచి తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తిని గుంటూరు నగరంపాలెం పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఏటీ అగ్రహారం 2వ లైనుకు చెందిన ఊదర నరసింహారావు అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్నాడని సీఐ సత్యనారాయణ చెప్పారు. తప్పించుకొని తిరుగుతున్న నిందితుణ్ణి పట్టుకున్నామని అన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు సహించేది లేదని హెచ్చరించారు.