News March 7, 2025

ఆటల పోటీల్లో విజేతగా అనకాపల్లి కలెక్టర్

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను అనకాపల్లి కలెక్టరేట్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ విజయకృష్ణన్ కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ఆటల పోటీల్లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, రెవెన్యూ శాఖకు చెందిన మహిళ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డిస్కస్ త్రో, స్పీడ్ వాకింగ్ పోటీల్లో కలెక్టర్ విన్నర్‌గా నిలిచారు.

Similar News

News September 15, 2025

అన్నమయ్య జిల్లాలో బాలికపై లైంగిక దాడి

image

అన్నమయ్య జిల్లాలో సోమవారం అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. తంబళ్లపల్లె మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలికపై అదే ఊరికి చెందిన 12ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తంబళ్లపల్లె SI ఉమామహేశ్వర్‌రెడ్డి తెలిపారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

News September 15, 2025

ANU: పీజీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలు విడుదల

image

ANUలో పీజీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను సోమవారం పరీక్షల నియంత్రణాధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. జులైలో జరిగిన ఎం.ఎస్సీ స్టాటిస్టిక్స్, ఎం.ఎస్సీ బయోకెమిస్ట్రీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రీవాల్యుయేషన్‌కు ఆసక్తిగల విద్యార్థులు ఒక్కో పరీక్షకు రూ.1,860 చొప్పున ఈ నెల 24వ తేదీలోపు చెల్లించాలని, పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన తెలిపారు.

News September 15, 2025

విశాఖలో పర్యటించనున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

image

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 17న విశాఖలో పర్యటించనున్నారు. 16న రాత్రి ఆమె విశాఖ చేరుకుని ప్రైవేటు రిసార్ట్‌లో బస చేస్తారు. 17న ఉదయం 10 గంటలకు ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్లో జిఎస్టి సంస్కరణలపై ఔట్ రీచ్ ప్రోగ్రాంలో పాల్గొంటారు. 12 గంటలకు స్వస్థ నారీ కార్యక్రమంలో వర్చువల్‌గా ప్రసంగిస్తారు.‌ 3 గంటలకు జీసీసీ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.