News December 28, 2024
ఆటోడ్రైవర్లు నిబంధనలు పాటించాలి: GNT ఎస్పీ

ఆటో డ్రైవర్ల ముసుగులో కొంతమంది అసాంఘిక, చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ అన్నారు. గుంటూరు నగరంలోని పోలీస్ కల్యాణ మండపంలో శనివారం ఆటోడ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిబంధనలకు అనుగుణంగా డ్రైవర్లు వ్యవహరించాలని కోరారు. ప్రయాణీకులతో గౌరవంగా వ్యవహరించాలని సూచించారు.
Similar News
News October 29, 2025
GNT: ఒక్క రాత్రిలో 1355.9 మి.మి వర్షపాతం

29 రాత్రి 12 గంటల నుంచి ఇప్పటివరకు నమోదైన వర్షపాతం వివరాలు. కాకుమాను116, పెదనందిపాడు 114.6, ప్రత్తిపాడు 109.4, చేబ్రోలు 91.4, కొల్లిపర 78.2, వట్టిచేరుకూరు 76.2, దుగ్గిరాల 74.6, తాడేపల్లి 74.2, GNT వెస్ట్ 68.8, పెదకాకాని 66.2, తాడికొండ 64.6, ఫిరంగిపురం 63.8, తుల్లూరు 62.8, తెనాలి 60.9, మేడికొండూరు 60.2, మంగళగిరి60, పొన్నూరు58, GNT ఈస్ట్ 58 మి.మిగా నమోదయింది.
News October 29, 2025
GNT: తుపాను దెబ్బకు వరి పంటలపై ఆందోళన

మొంథా తుపాను ప్రభావంతో మంగళవారం కురిసిన వర్షాలు రైతులను కలవరపెడుతున్నాయి. గుంటూరు, బాపట్ల జిల్లాల్లో వరి పంటలు ఈనె, గింజ పాలుదశల్లో ఉండగా భారీ వర్షం, గాలుల తాకిడికి నేలవాలుతున్నాయి. ఇప్పటికే 20 శాతం వరి పంటలు నష్టపోయినట్లు అంచనా. పంట తాలుగా మారే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబరులోనే తుపాను రావడంతో కోత ముందు కష్టాలు పెరిగాయని చెబుతున్నారు.
News October 29, 2025
అర్థరాత్రి ఆర్టీజీఎస్లో మంత్రి లోకేశ్ సమీక్ష

తుపాను తీవ్రతపై మంత్రి లోకేశ్ అర్థరాత్రి 12 గంటలకు ఆర్టీజీఎస్ కేంద్రంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి అనిత, మంత్రి నారాయణ పాల్గొన్నారు. తుపాన్ తీరం దాటే సమయం కావడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోకేశ్ ఆదేశించారు. ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి ఆయన ఈ రాత్రికి ఆర్టీజీఎస్ కేంద్రంలోనే బస చేయనున్నారు. పునరావాస కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు.


