News August 5, 2024
ఆటోమేటిక్ మిషన్‌తో సాగర్ గేట్ల ఎత్తివేత

నాగార్జునసాగర్ ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లను ఆటోమెటిక్ మిషన్ ద్వారా ఎత్తనున్నారు. ఏ గేటు ద్వారా ఎంత నీరు వెళ్లాలో ఈ మిషన్లో ఫీడ్ చేస్తే.. ఆ గేటు అంతే ఎత్తు లేచి అంతే నీరు బయటికి వెళ్తుంది. వెళ్లే నీరు స్క్రీన్‌పై కనబడుతుంది. గతంలోనే ఈ ఆటోమెటిక్ మిషన్ ఏర్పాటు చేయగా మరమ్మతులకు గురికావడంతో కొన్నాళ్లు మ్యానువల్‌గా గేట్లు ఎత్తారు. ఈ ఏడాది మరమ్మతులు చేయించి వినియోగంలోకి తెచ్చారు.
Similar News
News December 11, 2025
నల్గొండ జిల్లాలో తొలి సర్పంచ్ ఫలితం

అంతయ్యగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బలపరిచిన కన్నెబోయిన లక్ష్మయ్య విజయం సాధించారు. ఆయన తన సమీప ఇండిపెండెంట్ అభ్యర్థి బ్రహ్మచారిపై 21 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ సందర్భంగా సర్పంచ్ మద్దతుదారులు బాణసంచా కాల్చి, డప్పు వాయిద్యాలతో సంబరాలు చేసుకున్నారు.
News December 11, 2025
MGU పీజీ సెమిస్టర్-3 పరీక్షల టైం టేబుల్ విడుదల

MGU పరిధిలో నిర్వహించనున్న పీజీ (MA, M.Com, M.Sc, M.S.W) సెమిస్టర్-3 రెగ్యులర్ పరీక్షల టైం టేబుల్‌ను డా.ఉపేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల జనవరి 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. సంబంధిత టైం టేబుల్‌ను విద్యార్థులు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ తేదీలను గమనించాలని కోరారు.
News December 11, 2025
BREAKING: చౌటుప్పల్ హైవేపై భారీగా ట్రాఫిక్

గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనేందుకు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున పల్లె బాట పట్టారు. పట్నం ప్రజలు సొంతూళ్లకు తరలిరావడంతో చౌటుప్పల్ వద్ద హైవేపై భారీగా వాహనాలు బారులు తీరాయి. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాల్లో జనం సొంతూళ్లకు పయనమయ్యారు. ఉదయం 9 గంటల వరకు 19.58 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.


