News August 5, 2024

ఆటోమేటిక్ సైఫన్ సిస్టం కలిగిన ఏకైక ప్రాజెక్టు సరళ సాగర్

image

వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరమ్మపేట వద్ద ఊకచెట్టు వాగుపై ఉన్న సరళ సాగర్ ప్రాజెక్టును 1959లో నిర్మించారు. అప్పట్లో దీనిని 22 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టంతో రూపొందించారు. ఆసియా ఖండంలోనే ఆటోమేటిక్ సైఫన్ సిస్టం కలిగిన ప్రాజెక్టులో సరళ సాగర్ 2వదిగా చరిత్రలో నిలిచింది. ఈ ప్రాజెక్టులో నీరు నిండిన వెంటనే ఆటోమేటిక్‌గా సైఫన్స్ తెరుచుకోడం, వరద ఉద్ధృతి తగ్గగానే మూసుకోవడం దీనీ ప్రత్యేకతలు.

Similar News

News September 18, 2024

ప్రపంచ వెదురు దినోత్సవంలో శ్రీనివాస్ గౌడ్

image

వెదురుకు ప్రపంచంలో ఎంతో గుర్తింపు ఉందని మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తికి నిత్యావసరాలలాగే వెదురు వస్తువులు కూడా ఎంతో అవసరం అన్నారు. ఇలాంటివి తయారు చేసే కార్మికులను ప్రతి ఒక్కరూ అభినందించాలన్నారు.

News September 18, 2024

నేటి నుంచి ఆరోగ్యశ్రీ సిబ్బంది సమ్మె బాట

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్యశ్రీ సిబ్బంది సమ్మె చేయనున్నారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, తమకు నెలసరి జీతాలు పెంచాలని, ప్రమాదవశాత్తు విధి నిర్వహణలో తాము చనిపోతే తమ కుటుంబానికి పరిహారం అందించాలని ఆరోగ్యశ్రీ సిబ్బంది తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 94 మంది సిబ్బంది సమ్మెలో పాల్గొనున్నారు.

News September 18, 2024

కొత్తూరు నుంచి పుల్లూరు వరకు 37 బ్లాక్ స్పాట్లు !

image

ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారి-44 కొత్తూరు నుంచి పుల్లూరు వరకు విస్తరించి ఉంది. రహదారిపై మొత్తం 37 బ్లాక్ స్పాట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అందులో కేవలం 4 చోట్ల మాత్రమే వంతెనలు ఏర్పాటు చేశారు. మిగతా ప్రాంతాల్లో అండర్ బ్రిడ్జ్ ప్రతిపాదనలు పంపారు. కానీ ఇవి కాగితాలకు మాత్రమే పరిమితమయ్యాయి. దీంతో హైవేపై ప్రమాదాలు ఆగడం లేదు. ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులను రక్షించేందుకు ట్రామా కేంద్రాలు లేవు.