News December 3, 2024

ఆటో కార్మికుల సమస్యలు పరిసష్కరిస్తాం: మంత్రి పొన్నం

image

ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని సిద్దిపేట మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మినిస్టర్ క్వార్టర్స్‌లో తెలంగాణ ఆటో, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ యూనియన్ ఐక్య కార్యాచరణ సమితి నాయకులు మంగళవారం మంత్రిని కలిశారు. ఆటో కార్మికుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.  

Similar News

News November 25, 2025

మెదక్: 49 వేల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు

image

మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద్ తెలిపారు. ఇప్పటివరకు 49,027 మంది రైతుల నుండి 2,00,334 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రూ. 323.04 కోట్లు చెల్లింపులు జరిగాయన్నారు. అలాగే, 5,008 మంది సన్నధాన్యం రైతులకు రూ. 11.56 కోట్ల బోనస్ చెల్లింపులు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు.

News November 25, 2025

మెదక్‌: కార్మికులు బీమా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

మెదక్ జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయంలో కార్మిక భీమా పెంపు పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కార్మికుల బీమా పెంపు సదస్సులు ఈ నెల 24 నుంచి వచ్చే నెల 8 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికులకు సహజ మరణం సంభవిస్తే ఒక లక్ష నుంచి రూ.2లక్షల వరకు పెంచినట్లు తెలిపారు.

News November 25, 2025

మెదక్: మహిళలకు గుడ్ న్యూస్

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,37,438 మంది స్వయం సహాయక బృందాలలో ఆర్హులైన మహిళలకు వడ్డీ లేని రుణాలకింద రూ.8కోట్ల 80లక్షల వడ్డీని బ్యాంకు లీంకేజీపై మహిళల అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వడ్డీ లేని రుణాలతో మహిళలకు స్వయం ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.