News February 18, 2025
ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన ఎస్పీ

ఆటో డ్రైవర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సోమవారం ఎస్పీ బిందు మాధవ్ సూచించారు. కాకినాడ ట్రాఫిక్ 1, 2 టౌన్ పోలీసులు నగరంలో ఓవర్ లోడ్ ప్యాసింజర్, స్కూల్ చిల్డ్రన్స్ ఆటోలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ లేని ఆటోలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో 98 ఆటోలు సీజ్ చేసి కేసు నమోదు చేసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
Similar News
News December 1, 2025
5 స్టార్ రేటింగ్ సాధించిన మరిగడ్డ పాఠశాల

చందుర్తి మండలం మరిగడ్డ ప్రాథమిక పాఠశాల స్వచ్ఛ హరిత విద్యా రేటింగ్ సాధించింది. జాతీయ స్థాయిలో 2025- 26 సంవత్సరాన్నికి స్వచ్ఛ హరిత విద్యాలయం రేటింగ్లో జిల్లా నుంచి 650 పాఠశాలలు పాల్గొన్నాయి. మరిగడ్డ పాఠశాల 5 స్టార్ రేటింగ్ పొంది రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడప రఘుపతిరావు ప్రశంసా పత్రం అందుకున్నారు.
News December 1, 2025
AP NIT, YSR ఉద్యాన వర్సిటీ మధ్య MOU

తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్(AP NIT)తో వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం సోమవారం అవగాహన ఒప్పందం(MOU) చేసుకుంది. డ్రోన్ టెక్నాలజీ, డ్రయ్యర్ టెక్నాలజీ, నీటి పారుదలలో ఆధునిక యాంత్రికరణ, తెగుళ్లు గుర్తించడం, నానో టెక్నాలజీ తదితర అంశాల్లో రైతులకు అవగాహన కల్పించి ఖర్చులు తగ్గించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఏపీ నిట్ డైరెక్టర్ రమణ రావు, యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.శ్రీనివాసులు తెలిపారు.
News December 1, 2025
TG ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

TG: శిఖా గోయల్, CV ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర తదితర IPS ఆఫీసర్లను IAS క్యాడర్లో ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని హైకోర్టు CSకు నోటీసులిచ్చింది. GO 1342 ద్వారా ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించడం చట్టవిరుద్ధమని శ్రీకాంత్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన జస్టిస్ సూరేపల్లి నంద DEC10 లోపు సమాధానం ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేశారు.


