News March 4, 2025
ఆటో డ్రైవర్లకు నెల్లూరు DSP సూచనలు

ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ వాహనాలు నడపాలని నెల్లూరు నగర డీఎస్పీ సింధు ప్రియా తెలిపారు. నెల్లూరు నగరంలోని రంగనాయకుల గుడి సమీపంలోని ఫంక్షన్ హాల్లో 200 మంది ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రహదారి భద్రత మనందరి బాధ్యతని, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా వాహనదారులు ప్రజలకు ఇబ్బందు లేకుండా వాహనాలు నడపాలని సూచించారు.
Similar News
News December 4, 2025
నెల్లూరులో 5,198 మైక్రో ఎంటర్ప్రైజెస్ నమోదు..!

లోక్ సభలో నెల్లూరు MP వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి AP, నెల్లూరులో SHG కింద ఉన్న మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌పై ప్రశ్నించారు. MSME పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభా కరండ్లాజే మాట్లాడుతూ.. MSME పరిశ్రమల రిజిస్ట్రేషన్‌కు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను 1జులై2020న ప్రారంభించామన్నారు. అప్పటి నుంచి మైక్రో ఎంటర్ ప్రైజెస్ 30 నవంబర్ 2025 నాటికి APలో SHGల తరఫున 1,30,171, నెల్లూరులో 5,198 నమోదయ్యాయన్నారు.
News December 4, 2025
నెల్లూరు: వీఆర్సీ అండర్ బ్రిడ్జ్ వద్ద రాకపోకలు బంద్

వీఆర్సీ అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలబడడంతో ఆ ప్రాంతంలో అధికారులు రాకపోకలను నిషేధించారు. ఇటీవల ఈ అండర్ బ్రిడ్జి రిపేర్లు చేసిన విషయం తెలిసిందే. సుమారు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ నీళ్లు నిలబడడంతో రాకపోకలు సాగించలేని పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో వాహనాలను అనుమతించడం లేదు. దీనివల్ల ప్రజలు కిలోమీటర్ తిరిగి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది.
News December 4, 2025
నెల్లూరులో వరినాట్లు కళ్ల ముందే కొట్టుకుపోతున్నాయ్..!

నెల్లూరు జిల్లాలోని వరి నాట్లు కళ్ల ముందే కొట్టుకుపోతున్న దయనీయ పరిస్థితి నెలకొంది. జిల్లాలో 11 మండలాల పరిధిలోని 71 గ్రామాల్లో 1,169 హెక్టార్లలో నాట్లు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. 1,775 మంది రైతులు నష్ట పోయారన్నారు. భారీ వర్షాల వల్ల బోగోలు, విడవలూరు, కొడవలూరు, నెల్లూరు రూరల్, కావలి, కోవూరు, అల్లూరు, వెంకటాచలం, బుచ్చి, సంగం, మనుబోలు మండలాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.


