News March 4, 2025
ఆటో డ్రైవర్లకు నెల్లూరు DSP సూచనలు

ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ వాహనాలు నడపాలని నెల్లూరు నగర డీఎస్పీ సింధు ప్రియా తెలిపారు. నెల్లూరు నగరంలోని రంగనాయకుల గుడి సమీపంలోని ఫంక్షన్ హాల్‌లో 200 మంది ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రహదారి భద్రత మనందరి బాధ్యతని, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా వాహనదారులు ప్రజలకు ఇబ్బందు లేకుండా వాహనాలు నడపాలని సూచించారు.
Similar News
News March 21, 2025
పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం లేకుండా చూడండి: కలెక్టర్

నెల్లూరు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం లేకుండా, అనుమతులు మంజూరు చేసి పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ హాల్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తుల పురోగతి, పీఎంఈజీసి రుణాల మంజూరు అంశాలను కలెక్టర్‌కు వివరించారు.
News March 20, 2025
నెల్లూరు: ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం

నెల్లూరు కేసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో గురువారం ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభమైందని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి డాక్టర్ ఏ శ్రీనివాసులు తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలో మూల్యాంకనం పూర్తవుతుందని ఆర్ఐఓ తెలిపారు.
News March 20, 2025
నెల్లూరు: వైద్యులకు కలెక్టర్ సూచనలు

నెల్లూరు జీజీహెచ్‌లో జరుగుతున్న సదరం క్యాంప్‌ను జిల్లా కలెక్టర్ ఆనంద్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన దివ్యాంగులతో మాట్లాడి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. సదరం క్యాంప్‌లో దివ్యాంగులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జీజీహెచ్ అధికారులు, వైద్యులు, సిబ్బందికి కలెక్టర్ సూచించారు.