News March 4, 2025
ఆటో డ్రైవర్ కూతురికి ఎస్ఐ ఉద్యోగం

బేతంచెర్లకు చెందిన శేషాద్రి, నాగలక్ష్మి దంపతుల కుమార్తె నిర్మల ఎస్ఐగా ఎంపికయ్యారు. శేషాద్రికి ఐదుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆటో డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్న శేషాద్రి.. తన మూడో కుమార్తె నిర్మలను బీటెక్ వరకు చదివించారు. ఎస్ఐగా ఎంపికై అనంతపురం పోలీస్ శిక్షణ కార్యాలయంలో శిక్షణ పూర్తి చేసుకుని శ్రీ సత్యసాయి జిల్లాలో పోస్టింగ్ పొందారు. ఈ సందర్భంగా పలువురు నిర్మలను అభినందించారు.
Similar News
News February 27, 2026
358 మంది విద్యార్థుల గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 358 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి (RIO) లాలప్ప తెలిపారు. మొత్తం 5,069 మంది విద్యార్థులకు గానూ 4,711 మంది పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, పరీక్షలు అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిశాయని ఆయన పేర్కొన్నారు.
News February 27, 2026
‘కర్నూలు జిల్లాలో పుష్కలంగా ఎరువుల నిల్వలు’

2025-26 రబీ సీజన్‌కు సంబంధించి కర్నూలు జిల్లాలో ఎరువుల కొరత లేదని, అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు. జిల్లా అవసరాల కోసం 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అంచనా వేయగా, ప్రస్తుతం 25,635 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నానో యూరియా, నానో డీఏపీ కూడా అందుబాటులో ఉందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News February 27, 2026
బాలిక హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు

ఉలిందకొండ PS పరిధిలో 2016లో జరిగిన 8 ఏళ్ల బాలిక హత్య కేసులో నిందితుడు బోయ గిడ్డయ్య(60)కు జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు 1వ అదనపు జిల్లా & సెషన్స్ న్యాయమూర్తి పి.కమలా దేవి గురువారం తీర్పునిచ్చారు. కోర్టు రూ.7,000 జరిమానా విధించారు. చెల్లించకపోతే అదనంగా 2 నెలలు 15 రోజుల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. ఇదే కేసులో మరో నిందితుడుకి సాక్ష్యాల లోపంతో విముక్తి కల్పించారు.


