News March 4, 2025

ఆటో డ్రైవర్ కూతురికి ఎస్ఐ ఉద్యోగం

image

బేతంచెర్లకు చెందిన శేషాద్రి, నాగలక్ష్మి దంపతుల కుమార్తె నిర్మల ఎస్ఐగా ఎంపికయ్యారు. శేషాద్రికి ఐదుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆటో డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్న శేషాద్రి.. తన మూడో కుమార్తె నిర్మలను బీటెక్ వరకు చదివించారు. ఎస్ఐగా ఎంపికై అనంతపురం పోలీస్ శిక్షణ కార్యాలయంలో శిక్షణ పూర్తి చేసుకుని శ్రీ సత్యసాయి జిల్లాలో పోస్టింగ్ పొందారు. ఈ సందర్భంగా పలువురు నిర్మలను అభినందించారు.

Similar News

News March 15, 2025

పాక్‌లోని పంజాబ్‌లో బాలీవుడ్ పాటలపై బ్యాన్

image

బాలీవుడ్ పాటలపై పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ గవర్నమెంట్ నిషేధం విధించింది. ఈ పాటలను పాడడం, వినడం, డాన్స్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రావిన్స్‌లోని అన్ని కాలేజీలు, విద్యాసంస్థల్లో ఈ రూల్ వర్తిస్తుందని పేర్కొంది. దీనిని ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా పాకిస్థాన్‌కు చెందిన ఎక్కువమంది యువత బాలీవుడ్ సాంగ్స్‌కు డాన్స్ చేస్తారనే విషయం తెలిసిందే.

News March 15, 2025

చెన్నారావుపేట: ఏఐ ద్వారా విద్యాబోధన ప్రారంభం

image

చెన్నారావుపేట మండల ప్రాథమిక పాఠశాలలో శనివారం ఏఐ ద్వారా బోధనను కలెక్టర్ సత్య శారదా దేవి ప్రారంభించారు. ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధను వినియోగిస్తూ సులభతరంగా విద్యను అందిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లా వ్యాప్తంగా 11 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ సహకారంతో వర్చువల్ రియాల్టీ విధానంలో పాఠాలు చెప్పేలా ప్రారంభించుకున్నామన్నారు.

News March 15, 2025

నర్సాపూర్: నాటు తుపాకులతో తిరుగుతున్న 8 మంది అరెస్ట్

image

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నత్నాయపల్లి అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటకు నాటు తుపాకీలతో తిరుగుతున్న ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిపై పోలీసు కేసు నమోదైంది. అరెస్టయిన వారిలో యాసిన్, శ్రీకాంత్, కృష్ణ, శంకరయ్య, వీరాస్వామి, పోచయ్య, విజయ్, భాను ప్రసాద్ ఉన్నారు. వారిని కోర్టులో హాజరు పరిచారు.

error: Content is protected !!