News March 4, 2025

ఆటో డ్రైవర్ కూతురికి ఎస్ఐ ఉద్యోగం

image

బేతంచెర్లకు చెందిన శేషాద్రి, నాగలక్ష్మి దంపతుల కుమార్తె నిర్మల ఎస్ఐగా ఎంపికయ్యారు. శేషాద్రికి ఐదుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆటో డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్న శేషాద్రి.. తన మూడో కుమార్తె నిర్మలను బీటెక్ వరకు చదివించారు. ఎస్ఐగా ఎంపికై అనంతపురం పోలీస్ శిక్షణ కార్యాలయంలో శిక్షణ పూర్తి చేసుకుని శ్రీ సత్యసాయి జిల్లాలో పోస్టింగ్ పొందారు. ఈ సందర్భంగా పలువురు నిర్మలను అభినందించారు.

Similar News

News March 16, 2025

పది విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం

image

ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ఆదోని ఆర్టీసీ డిపో మేనేజర్ రఫిక్ వెల్లడించారు. విద్యార్థులు ఆర్టీసీ బస్సు కండక్టర్లకు హాల్ టికెట్ చూపించి, 14 రోజుల పాటు ఉచితంగా ప్రయాణించే వెసలుబాటు కల్పించామన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News March 16, 2025

జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిద్దాం: స్పెషల్ ఆఫీసర్

image

జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిద్దామని జిల్లా ఇన్‌ఛార్జ్ ఆఫీసర్, రహదారులు, భవనాలు, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే పేర్కొన్నారు. శనివారం కర్నూలు కలెక్టరేట్లో కలెక్టర్ రంజిత్ బాషా అధ్యక్షతన జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో పేదరిక నిర్మూలన, ఎంఎస్ఎంఈల ఏర్పాటు, విద్య, వైద్య రంగాల అభివృద్ధి, నీటి వనరుల వినియోగం అంశాలపై దృష్టి సారిస్తామన్నారు.

News March 15, 2025

కర్నూలు జిల్లాలో 393 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సర పరీక్షకు 393 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు.19,182 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 393 విద్యార్థులు హాజరు కాలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి మల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని ఆర్ఐఓ స్పష్టం చేశారు.

error: Content is protected !!